నేటి నుంచి తెలంగాణలో విద్యార్థులకు ఆన్‌లైన్‌ పాఠాలు

Online digital classes for 8,9,10th students in telangana. తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేటి నుండి రాష్ట్రంలోని ఉన్నత పాఠశాల

By అంజి  Published on  24 Jan 2022 2:39 AM GMT
నేటి నుంచి తెలంగాణలో విద్యార్థులకు ఆన్‌లైన్‌ పాఠాలు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేటి నుండి రాష్ట్రంలోని ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించాలని నిర్ణయించింది. 8,9,10 తరగతులకు చెందిన విద్యార్థులకు టీశాట్‌ ద్వారా ఇవాళ్టి నుండి డిజిటల్‌ పద్ధతిలో పాఠాలు బోధించనున్నారు. జనవరి 28వ తేదీ వరకు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తారు. టీశాట్‌, దూరదర్శన్‌, యాదగిరి చానళ్ల ద్వారా ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో పాఠాలు ప్రసారం అవుతాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాటు చేసింది. అలాగే సర్కార్‌ బడుల్లో పని చేస్తున్న సిబ్బంది 50 శాతం హాజరుకావాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

రాష్ట్రంలో ఓమిక్రాన్‌ వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో.. స్కూళ్లకు, కాలేజీలకు ఇచ్చిన జనవరి 16 వరకు ఇచ్చిన సంక్రాంతి సెలవులను ప్రభుత్వం పొడిగించింది. ఈ నెల 30వ తేదీ వరకు స్కూళ్లకు సెలవులు కొనసాగుతాయని మొదట చెప్పింది. ఆ తర్వాత ఉన్నత పాఠశాల, కాలేజీలకు విద్యాబోధన ఆన్‌లైన్‌లో నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. కరోనా ఫస్ట్‌, సెంకడ్‌ వేవ్‌ల కారణంగా గత సంవత్సరం మార్చి నుండి విద్యా సంస్థల్లో పర్తిగా ఆన్‌లైన్‌లో విద్యాబోధన జరిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. సెప్టెంబర్‌ 2021 నుండి భౌతికంగా స్కూళ్లు ప్రారంభం అయ్యాయి.

Next Story