అన్నయ్యా, హ్యాపీ బర్త్ డే...కేటీఆర్‌కు కవిత విషెస్

కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన సోదరి కల్వకుంట్ల కవిత విషెస్ తెలిపారు.

By Knakam Karthik
Published on : 24 July 2025 10:18 AM IST

Telangana, Brs, Ktr, Kavitha,

అన్నయ్యా, హ్యాపీ బర్త్ డే...కేటీఆర్‌కు కవిత విషెస్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తన సోదరుడు కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన సోదరి కల్వకుంట్ల కవిత విషెస్ తెలిపారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫ్లామ్ ఎక్స్ వేదికగా ఆమె విషెస్ తెలియజేశారు. 'అన్నయ్యా..మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే'.అని ట్వీట్ చేస్తూ కేటీఆర్‌ను ట్యాగ్ చేశారు.

అయితే మాజీ సీఎం కేసీఆర్‌కు లేఖ నేపథ్యంలో కేటీఆర్, కవిత మధ్య గ్యాప్ వచ్చిందని రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరిగిన సంగతి తెలిసిందే. తదనంతరం విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన కవితకు ఎయిర్‌పోర్టులో జాగృతి నేతలు ఘనంగా స్వాగతం పలికారు. ఆ సమయంలో కవిత ఫొటోలతో కూడిన ప్లకార్డులను ప్రదర్శించారు. ఆ తర్వాత నుంచి ఆమె బీసీ రిజర్వేషన్లపై పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్‌ ఆమోదం కోసం గవర్నర్‌కు పంపింది. ఆ తర్వాత జాగృతి నేతలు సంబరాలు చేసుకోవడం..కాంగ్రెస్, జాగృతి నేతల మధ్య చర్చకు దారి తీసింది.

ఆ తర్వాత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారని జాగృతి నేతలు ఆయన కార్యాలయంపై దాడికి దిగడం చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలపై బీఆర్ఎస్ పార్టీ స్పందించకపోవడం, ఆ విషయంపై నిర్ణయం పార్టీ విజ్ఞతకే వదిలేస్తున్నానని కవిత వ్యాఖ్యానించడం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిగా మారింది.

Next Story