తెలుగు రాష్ట్రాలకు కొత్త ఐపీఎస్ అధికారులు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు కొత్త ఐపీఎస్ అధికారులను కేటాయిస్తూ కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది

By Medi Samrat  Published on  17 Jan 2024 12:55 PM GMT
తెలుగు రాష్ట్రాలకు కొత్త ఐపీఎస్ అధికారులు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు కొత్త ఐపీఎస్ అధికారులను కేటాయిస్తూ కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణకు ఆరుగురు, ఏపీకి ముగ్గురు అధికారులను కేటాయించారు. వీరంతా 2022 బ్యాచ్ కు చెందినవారు. తెలంగాణకు కేటాయించిన ఐపీఎస్ అధికారుల్లో సాయి కిరణ్, రాహుల్ కాంత్, రుత్విక్ సాయి, మంధారే సోహం సునీల్, ఆయేషా ఫాతిమా, మనన్ భట్ ఉన్నారు.

తెలంగాణకు కొత్తగా ఆరుగురు ఐపీఎస్‌లను కేంద్రం కేటాయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. 2022 బ్యాచ్‌కు చెందిన అయేషా ఫాతిమా, మంధారే సోహం సునీల్, సాయి కిరణ్, మనన్ భట్, రాహుల్ కాంత్, రుత్విక్ సాయిని కేటాయించింది. ఇటీవల ఢిల్లీ పర్యటనలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రానికి అదనంగా ఐపీఎస్‌ అధికారులను కేటాయించాలని కోరారు. జిల్లాల విభ‌జ‌న‌, వివిధ శాఖ‌ల పర్యవేక్షణ నిమిత్తం రాష్ట్రానికి అద‌నంగా 29 అద‌న‌పు ఐపీఎస్ పోస్టులు కేటాయించాల‌ని సీఎం రేవంత్ విజ్ఞప్తికి అమిత్ షా సానుకూలంగా స్పందించారు. 2024లో కొత్తగా వ‌చ్చే ఐపీఎస్ బ్యాచ్ నుంచి తెలంగాణ‌కు అధికారుల‌ను అద‌నంగా కేటాయిస్తామ‌ని హామీ ఇచ్చారు.

Next Story