త్వరలోనే తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిని ఎన్నుకోబోతున్నట్లు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆర్‌ఎస్ఎస్ నేపథ్యం ఉండాలన్న నిబంధనేది లేదని అన్నారు. వారం రోజుల తర్వాత తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిని ఎన్నుకుంటారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చెప్పారు. బీజేపీలో వచ్చే అధ్యక్షుడు ఎవరో ఎవరూ చెప్పలేరన్నారు కిషన్ రెడ్డి. కొత్త సభ్యత్వాలు,పోలింగ్ బూత్ కమిటీలు,మండల కమిటీలు పూర్తయ్యాయని, జిల్లా కమిటీల ఎన్నిక ప్రక్రియ నడుస్తోందన్నారు.
పార్టీలో మహిళలకు 33 శాతం పదవులు ఇస్తామని కిషన్ రెడ్డి తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం. తెలంగాణలో ఎవరితో పొత్తు ఉండదు..బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుంది. గ్రామ పంచాయతీలకు కేంద్రం నుంచి మూడు వాయిదాల నిధులు రాలేదంటే అందుకు కారణం స్థానిక సంస్థల ఎన్నికలు జరపకపోవడమేనన్నారు. హైదరాబాద్‌లో ఏడు నెలలుగా వీధి దీపాలు కాలిపోతే నిధుల కొరత ఏర్పడిందని, పునర్విభజన చట్టం ప్రకారం ఏపీకి నిధులు కేటాయించామన్నారు. ఇక తెలంగాణలో మద్యంపై వచ్చిన డబ్బులు కూడా డైవర్ట్ చేశారన్నారు కిషన్ రెడ్డి.