అనసూయ మీద మండిపడుతున్నారే..!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమిని ఒప్పుకుంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.
By Medi Samrat Published on 3 Dec 2023 8:30 PM ISTతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమిని ఒప్పుకుంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. వరుసగా రెండు సార్లు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించిన అధికారం కట్టబెట్టిన తెలంగాణ ప్రజలకి కృతజ్ఞతలు. ఈ రోజు ఫలితాలను చూసి మేము బాధపడటం లేదు.. కానీ ఊహించని విధంగా జరగడంతో కాస్త నిరాశ మాత్రం ఉంది. కానీ ఈ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకొని తిరిగి కెరటంలా ముందుకొస్తాం. ఇక ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి శుభాకాంక్షలు. వారికి ఆల్ ది బెస్ట్ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కు పలువురు నెటిజన్లు స్పందించారు.
ఆ స్పందించిన ప్రముఖుల్లో టాలీవుడ్ నటి అనసూయ భరద్వాజ్ కూడా ఉన్నారు. ఎంతోమందికి రోల్ మోడల్‌గా నిలిచిన మీరు నిజమైన లీడర్ సార్. అయితే ఈ సారి మీకు ప్రజలు ఇచ్చిన ప్రతిపక్ష హోదాను కూడా అదే విధంగా బాధ్యతగా మీరు నిర్వర్తించాల్సిన అవసరం ఉంది. ప్రతి క్షణం అభివృద్ధి చేస్తూ హైదరాబాద్‌తో మళ్లీ మళ్లీ ప్రేమలో పడే విధంగా చేసిన మీకు పెద్ద థాంక్యూ.. అంటూ అనసూయ చెప్పుకొచ్చారు. అయితే కొందరు అదే పనిగా అనసూయను టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. కాంగ్రెస్ పార్టీ విజయాన్ని జీర్ణించుకోలేకపోతున్నావు కదూ అంటూ అనసూయను కొందరు విమర్శిస్తూ వస్తున్నారు.