Telangana : పదేళ్లు జైలు శిక్ష అనుభవించి వచ్చి.. కూతురుపై లైంగిక వేధింపులు

ఇటీవలే పదేళ్ల జైలుశిక్షను పూర్తి చేసుకుని బయటకు వచ్చిన వ్యక్తి.. తన కుమార్తెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే ఆరోపణలపై అరెస్టయ్యాడు

By Medi Samrat  Published on  29 July 2024 7:19 PM IST
Telangana : పదేళ్లు జైలు శిక్ష అనుభవించి వచ్చి.. కూతురుపై లైంగిక వేధింపులు

ఇటీవలే పదేళ్ల జైలుశిక్షను పూర్తి చేసుకుని బయటకు వచ్చిన వ్యక్తి.. తన కుమార్తెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే ఆరోపణలపై అరెస్టయ్యాడు. దూదులే సంజీవ్ (38) అనే వ్యక్తి తన కుమార్తెపై జూలై 19న లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. మహారాష్ట్రకు చెందిన అతను జీవనోపాధి కోసం నిర్మల్‌కు వలస వచ్చాడు. తన కూతురిని లైంగికంగా వేధించిన సంజీవ్ ఆ తర్వాత మహారాష్ట్రలోని పూణెకు పారిపోయాడు. అయితే తాండ్ర గ్రామానికి తిరిగి రాగానే అతడిని అదుపులోకి తీసుకున్నారు.

2014లో తాండ్రలోని ఇటుక బట్టీలో పని చేస్తున్న అతడు.. తన రెండవ భార్యను అనుమానంతో హత్య చేసినందుకు అతనికి 10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది కోర్టు. అతను ఐదు నెలల క్రితం జైలు నుండి విడుదలయ్యాడు. రెండో భార్యలాగే కూతురిని కూడా చంపేస్తానని బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. అయితే, బాధితురాలు తన తల్లి, సోదరుడికి జరిగిన దారుణాన్ని వివరించింది. వారు దిలావర్‌పూర్ పోలీసులను ఆశ్రయించగా.. అతనిపై కేసు నమోదు చేశారు. దర్యాప్తు అధికారులు అతని కదలికలపై నిఘా ఉంచి అరెస్టు చేశారు.

Next Story