తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలలో ఎన్నికలు జరగనున్నాయి. రేపటి నుంచి ఈనెల 30 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. 31న పరిశీలన ఉంటుంది. ఫిబ్రవరి 11న పోలింగ్ జరగనుంది. 13న కౌంటింగ్, అదే రోజు ఫలితాలు వెల్లడి కానున్నాయి. మొత్తంగా 52.43 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. కాగా ఇవాళ్టి నుంచి ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది.