కాంగ్రెస్ ఉప్పెనలో బీఆర్ఎస్ కొట్టుకుపోతుంది : ఉత్తమ్
కర్ణాటక లో గృహ లక్ష్మి పథకం ప్రారంభమైందని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
By Medi Samrat Published on 30 Aug 2023 6:15 PM ISTకర్ణాటక లో గృహ లక్ష్మి పథకం ప్రారంభమైందని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. గాంధీ భవన్‌లో ఆయన మాట్లాడుతూ.. కోటి మంది మహిళలకు నెలకు 2 వేలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందని వెల్లడించారు. కేంద్రంలో, రాష్ట్రంలో ప్రభుత్వాలు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతున్నాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇచ్చిన మాట వెంటనే అమలు చేస్తున్నాయని తెలిపారు.
మా 5 గ్యారంటీ స్కీమ్ లలో
1.కర్ణాటక లో 200 విద్యుత్ యూనిట్లు నిరుపేదలకు ఇస్తున్నాం
2.కర్ణాటక లో ఫ్రీ బస్ ప్రయాణం మహిళలకు అందిస్తున్నాం
3. గృహలక్ష్మి స్కీమ్ అమలులోకి వచ్చింది
4. అన్న భాగ్య స్కీమ్ కింద నెలకు 5 కిలోల బియ్యం.. లేదంటే 170 రూపాయలు నెలకు ఇస్తున్నాం
రెండు నెలలు తిరగక ముందే 5 గ్యారంటీల్లో 4 అమలు చేశామని వెల్లడించారు. వచ్చే నెల నుండి యువ నిధి స్కీమ్ కూడా అమలు చేస్తామన్నారు. హిమాచల్ ప్రదేశ్ లో గెలిచిన వెంటనే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేసామని తెలిపారు. తెలంగాణలో కూడా ఉద్యోగుల డిమాండ్ మేరకు.. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేస్తామన్నారు. తెలంగాణలో ఇప్పుడు ఒక వ్యక్తికి ఒక కిలో బియ్యం బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తుంటే.. మిగతా 5 కిలోలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందన్నారు.
తెలంగాణలో దళిత ముఖ్యమంత్రి, డబుల్ బెడ్రూమ్, కేజీ టూ పీజీ అమలు చేయలేదన్నారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఏమయ్యాని ప్రశ్నించారు. దళిత గిరిజనలకు 3 ఎకరాలు అమలు చేయలేదన్నారు. ఉచిత ఎరువులు అమలు చేయలేదు.
రాహుల్ గాంధీ నేతృత్వంలో చెప్పిన మాట నిలబెట్టుకుంటామన్నారు. మేము అధికారంలోకి వస్తామనే నమ్మకం ఉందన్నారు. ప్రభుత్వ వ్యతిరేకత కాంగ్రెస్ కి కలసి వస్తుందన్నారు. కాంగ్రెస్ ఉప్పెనలో బీఆర్ఎస్ కొట్టుకుపోతుందన్నారు.
నేను హుజూర్ నగర్ నుండి పోటీ చేస్తున్నా.. కోదాడ నుండి పద్మావతి రెడ్డి పోటీ చేస్తారని స్పష్టం చేశారు. ఇంత దిగజారుడు, దోపిడీ ప్రభుత్వాన్ని నేను 30 ఏళ్ళ ఎమ్మెల్యే గా ఎప్పుడు చూడలేదన్నారు. టికెట్ల ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలనిఅధిష్టానన్ని కోరుతున్నా.. ఏఐసీసీ నిబంధనల మేరకు.. ఉదయ్ పూర్ డిక్లరేషన్ మేరకే టికెట్లు ఉంటాయని అన్నారు.