కేసీఆర్, హరీష్ రావు బీజేపీలోకా.. ఎంపీ రఘునందన్ రావు కామెంట్స్ విన్నారా?

తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీని పలువురు నేతలు వీడుతూ ఉన్నారు.

By Medi Samrat  Published on  22 Jun 2024 5:00 PM IST
కేసీఆర్, హరీష్ రావు బీజేపీలోకా.. ఎంపీ రఘునందన్ రావు కామెంట్స్ విన్నారా?

తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీని పలువురు నేతలు వీడుతూ ఉన్నారు. ఇటీవల లోక్ సభ ఎన్నికల్లో ఆ పార్టీ ఒక్క సీటును కూడా నెగ్గకపోవడంతో బీఆర్ఎస్ ను వీడడమే బెటర్ అని కొందరు నాయకులు ఫిక్స్ అయిపోయారని టాక్. ఆయా నాయకులను చేర్చుకోడానికి కాంగ్రెస్, బీజేపీ కూడా సిద్ధమయ్యాయి. తాజాగా బీజేపీ నేత రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.

బీఆర్ఎస్ అగ్రనేతలు కేసీఆర్, హరీష్ రావు బీజేపీలోకి ఎవరు వచ్చినా స్వాగతిస్తామని రఘునందన్ రావు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణలో భవిష్యత్తు లేదని.. ఆ పార్టీ నేతలను బీజేపీలో చేర్చుకోడానికి తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. ములుగు మండలం క్షీర సాగర్ గ్రామంలో 80 మంది దళితుల భూములు అక్రమంగా వెంకట్ రాం రెడ్డి లాక్కున్నారన్నారని.. దళితుల భూములు వారికి అప్పగించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఐటీఐఆర్ ప్రాజెక్టు గైడ్ లైన్స్ అన్ని అమలు చేశామన్నారు. ఐటీఐఆర్ గురించి తెలిస్తే కాంగ్రెస్ నేత జగ్గారెడ్డితో చర్చకు సిద్ధమని సవాల్ చేశారు. జగ్గారెడ్డి పెరిగింది ఆర్ఎస్ఎస్‌లో ఆయన మొదట గెలిచింది బీజేపీ నుంచే అని గుర్తుచేశారు. జగ్గారెడ్డి తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినట్టు ఉందని విమర్శించారు.

Next Story