అప్పుడు ఆత్మగౌరవం గుర్తుకు రాలేదా.? : ఎంపీ చామల

మున్సిపల్ ఎన్నికలకు నామినేషన్ ప్రక్రియ ఈరోజుతో ముగియనున్నదని.. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఓటు వేయొద్ద‌ని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

By -  Medi Samrat
Published on : 3 Feb 2026 5:40 PM IST

అప్పుడు ఆత్మగౌరవం గుర్తుకు రాలేదా.? : ఎంపీ చామల

మున్సిపల్ ఎన్నికలకు నామినేషన్ ప్రక్రియ ఈరోజుతో ముగియనున్నదని.. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఓటు వేయొద్ద‌ని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో ఆయ‌న మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల్లో తొండి చేసి ఏదో రకంగా గెలవాలని బీఆర్ఎస్‌ చూస్తుందన్నారు.

కేసీఆర్‌కు సిట్ నోటీసులు ఇస్తే రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేశారు. కేటీఆర్ కేసీఆర్‌ను జాతిపిత అంటూ పిట్టకథలు చెప్తున్నాడని ఎద్దేవా చేశారు. కేటీఆర్, హరీష్ రావు కాంగ్రెస్ పార్టీపై విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారన్నారు. హరీష్ రావు అనే వ్యక్తి ఎమ్మెల్యే కాకుండానే రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రి అయ్యారని.. ఓట్లు వేయించుకొని గెలవకుండానే మంత్రి పదవి తీసుకున్న లక్కి స్టార్ హరీష్ రావు దుయ్య‌బ‌ట్టారు.

హరీష్ రావు గుంట నక్క మామ తుది శ్వాస విడిస్తే ఆ పదవి తీసుకుందామని కుర్చీ దగ్గర కూర్చున్నారని కవిత చెప్పిందని.. రేవంత్ రెడ్డి ఎవరి సహాయ లేకుండానే ముఖ్యమంత్రి స్థాయికి వచ్చారు.. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాడని హరీష్ రావుకు కడుపుమంట.. హరీష్ రావుకు కడుపు మంట మండితే నేనేం ఏం చేయగలను.. ఆయనకి ENO ప్యాకెట్ ఇవ్వడం తప్ప.. హరీష్ రావు పిచ్చి మాటలు, పిట్ట కథలు బంద్ చేయాలన్నారు. కేటీఆర్ లాగా రేవంత్ రెడ్డి అమెరికా నుంచి ఊడి పడలేదన్నారు.

తెలంగాణ ఆత్మగౌరవం ఎక్కడ ఉందని ప్ర‌శ్నించిన చామ‌ల‌.. కేసీఆర్ తెలంగాణ ప్రజలను మభ్య పెట్టారని అన్నారు. =చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మంత్రి పదవి రాలేదని కేసీఆర్ బయటికి వచ్చారు. నా కుటుంబంలో ఎవరికి ఆశ లేదని కేసీఆర్ ఉద్యమ సమయంలో చెప్పారు. వచ్చిన తెలంగాణలో అందరికీ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఎవరికి ఉద్యోగాలు ఇవ్వకుండా కేసీఆర్ తన కుటుంబ సభ్యులకు మంత్రి పదవులు, ఎంపీ సీట్లు ఇచ్చుకున్నాడని విమ‌ర్శించారు.

పదేళ్లు బీఆర్ఎస్ పరిపాలించి ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు. బీఆర్ఎస్ పిట్టకథలు ప్రజలు మరువ లేదని.. ఎంపీ ఎన్నికల్లో జీరో సీట్లకు ప‌రిమితం కాగా, జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఓడిపోయారన్నారు.

గద్దర్‌ను గేటు దగ్గర కూర్చోబెట్టినప్పుడు ఆత్మగౌరం గుర్తుకు రాలేదా ? బీసీ బిడ్డ ఈటెల రాజేందర్‌ను బయటికి పంపించినప్పుడు ఆత్మగౌరం గుర్తుకు రాలేదా ? అని ప్ర‌శ్నించారు.

కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు. బీజేపీ ఎంపీలు తెలంగాణ కోసం పోరాటం చేసింది ఏమి లేదన్నారు. గ్రూప్ 1, గ్రూప్ 3 పరీక్ష పేపర్ లీక్ లేకుండా నిర్వహించామ‌న్నారు.. మేము వచ్చిన తర్వాత 65 వేల ఉద్యోగాలు ఇచ్చామని.. జాబ్ క్యాలెండర్ హామీ నెరవేరుస్తామ‌న్నారు.

Next Story