మా ప్రభుత్వానికి కూడా భక్తి, శ్రద్ధలున్నాయ్‌ : ఎంపీ చామల

బీఆర్ఎస్ నేత హరీష్ రావు, బీజేపీ ఛీప్ రామచందర్ రావుకు కాంగ్రెస్‌ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటరిచ్చారు.

By -  Medi Samrat
Published on : 28 Feb 2026 1:52 PM IST

మా ప్రభుత్వానికి కూడా భక్తి, శ్రద్ధలున్నాయ్‌ : ఎంపీ చామల

బీఆర్ఎస్ నేత హరీష్ రావు, బీజేపీ ఛీప్ రామచందర్ రావుకు కాంగ్రెస్‌ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటరిచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రూ.150 కోట్ల విలువైన కోకాపేట్ భూములను కేవలం ఒక్క రూపాయికే శారదా పీఠానికి ఇచ్చారు. ప్రాధాన్యత ఉన్న‌ ప్రాంతాల్లో నచ్చిన వారి కోసం భూములను పేలాల లాగ పంచారని మండిప‌డ్డారు.

శారదా పీఠం భూమిని వాళ్ళ అనుమతితో శంషాబాద్ తరలిస్తున్నామ‌న్నారు. శారద పీఠం ఉన్న ఏరియాలో మంజీరా నీళ్లతో ప్రజలకు మంచినీళ్లు అందించడానికి వాటర్ వర్క్స్ జరుగుతున్నవని పేర్కొన్నారు. కోర్ అర్బన్ ఏరియాలో మెట్రో, మూసీని అభివృద్ధి చేయడం ప్రజల కోసమేన‌న్నారు. ఎక్కడ అభివృద్ధి జరగొద్దని హరీష్ రావు, కేటీఆర్‌లు అడ్డుపడుతున్నారు.. బావ, బామ్మర్ది హరీష్ రావు, కేటీఆర్‌ల‌ పొజిషన్ ఏందో తెలియదు.. మేము అపొజిషన్ అంటున్నారు.. మా ప్రభుత్వానికి కూడా భక్తి, శ్రద్ధలు ఉన్నాయన్నారు. వేములవాడ, సమ్మక్క సారక్క దేవాలయాలను కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందన్నారు. రాష్ట్రంలో మంచి జరిగితే మళ్ళీ కాంగ్రెస్ కు పట్టం కడతారని హరీష్ రావు, కేటీఆర్ విష బీజాలు వేస్తున్నారు.. మీలాగ కమిషన్ల కోసం కాళేశ్వరం కట్టలేదన్నారు.

గుజరాత్ లో మోడీ సబర్మతిని అభివృద్ధి చేసినట్లు.. తెలంగాణలో మూసీ అభివృద్ధి చేయొద్దా? అని ప్ర‌శ్నించారు. సబర్మతికి, మూసీకి సంబంధం లేదని రామచందర్ రావు అంటుండు.. మూసీకి, సబర్మతికి ఎందుకు సంబంధం లేదు.. గాంధీ నగర్‌లో ఉన్న నది ఒడ్డున ఎన్ని ఇండ్లు తీశారు.. మీరు అక్రమంగా తొలగించవచ్చు కానీ ఇక్కడ చేయకూడదా? అని ప్ర‌శ్నించారు. బీఆర్ఎస్ మాట్లాడిన గంట తర్వత బీజేపీ మాట్లాడుతుంది..ఢిల్లీకి పోయి ఒక మాట.. గల్లీలో ఒక మాట మాట్లాడితే ఎట్లా? అని ప్ర‌శ్నించారు.

Next Story