హైదరాబాద్: ఎమ్మెల్సీ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు బీఆర్ఎస్ ప్రకటన విడుదల చేసింది. ఆమె వ్యాఖ్యలు పార్టీకి నష్టం కలిగిస్తున్నాయని సస్పెన్షన్ వేటు వేసినట్లు ప్రకటన రిలీజ్ చేసింది. కాగా పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కవితను తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు.. పార్టీ క్రమశిక్షణా వ్యవహారాల బాధ్యులు భరత్ కుమార్, ప్రధాన కార్యదర్శి రవీందర్ పేరుతో బీఆర్ఎస్ ప్రకటన విడుదల చేసింది.