ఇంత అసహనం పనికిరాదు, మార్పు ఎలా తెస్తారు?: ఎమ్మెల్సీ కవిత

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఎక్స్ వేదికగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

By Knakam Karthik  Published on  14 March 2025 4:17 PM IST
Telangana, Congress, Brs, MLC Kavitha, CM Revanth Reddy, Jagadish Reddy, TG Assembly

ఇంత అసహనం పనికిరాదు, మార్పు ఎలా తెస్తారు?: ఎమ్మెల్సీ కవిత

తెలంగాణ అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డిని స్పీకర్ ప్రసాద్ కుమార్ సమావేశాలు ముగిసే వరకు సస్పెన్షన్ వేటు తెలిసిందే. జగదీశ్ రెడ్డి సస్పెన్షన్‌పై బీఆర్ఎస్ నాయకులు స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఎక్స్ వేదికగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఓర్పు లేని వాళ్ళు మార్పు ఎలా తెస్తారు ? అని ఆమె ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై గొంతెత్తుతూ, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపితే సభ నుంచి బహిష్కరిస్తారా ? ప్రజా సమస్యలను శాసనసభలో కూడా లేవనెత్తనివ్వరా? అని ప్రశ్నించారు.

కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి సీఎం రేవంత్‌రెడ్డి‌కి ఇంత అసహనం పనికిరాదు.. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చ జరగకుండా ప్రజల దృష్టి మళ్లించడానికే జగదీశ్‌రెడ్డి‌ని సస్పెండ్ చేసినట్లు స్పష్టమవుతోందని అభిప్రాయపడ్డారు. తక్షణమే జగదీశ్ రెడ్డిపై సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.

Next Story