హరీశ్ రావు ట్రబుల్ షూటర్ కాదు, బబుల్ షూటర్: కవిత
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, హరీశ్ రావు ఒకే ఫ్లైట్‌లో జర్నీ చేసినప్పుడు తనపై కుట్రలు ప్రారంభం అయ్యాయి..అని ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు
By Knakam Karthik
హరీశ్ రావు ట్రబుల్ షూటర్ కాదు, బబుల్ షూటర్: కవిత
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, హరీశ్ రావు ఒకే ఫ్లైట్‌లో జర్నీ చేసినప్పుడు తనపై కుట్రలు ప్రారంభం అయ్యాయి..అని ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ తర్వాత ఆమె హైదరాబాద్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ... కల్వకుంట్ల కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయాలనే ఉద్దేశంతోనే సీఎం రేవంత్, హరీశ్ రావు పని చేస్తున్నారు. నాపై అక్రమ కేసులు పెడితే 5 నెలలు తీహార్ జైలులో ఉన్నా. హరీశ్ రావు ట్రబుల్ షూటర్, కాదు బబుల్ షూటర్..సమస్యను ఆయనే క్రియేట్ చేసి, సాల్వ్ చేసినట్లు క్రియేట్ చేస్తారు. నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసే దాకా కుట్ర పన్నారు..ఇప్పుడు సంతోషంగా ఉన్నారు..అని కవిత వ్యాఖ్యానించారు.
ఎమ్మెల్సీ పదవి, బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నా. పదవులపై నాకు ఆశ లేదు. పార్టీలో కొందరు నాపై పని కట్టుకొని విమర్శలు చేశారు. మే డే రోజు సామాజిక తెలంగాణ కోసం మాట్లాడితే తప్పేంటి.? దానిపై నాపై హరీష్ రావు సంతోష్ విమర్శించడం చేశారు. నాపై కుట్రలు జరుగుతున్నాయని భవన్లో ప్రెస్ మీట్ పెడితే రామన్న ఎందుకు అడగలేదు. మహిళ ఎమ్మెల్సీగా భవన్ లో కూర్చున్న నాపై కుట్రలు జరుగుతున్నాయంటే కేటీఆర్ ఎందుకు మాట్లాడలేదు?. కేసీఆర్ బిడ్డగా నాకే అన్యాయం జరుగుతుందంటే రెస్పాండ్ అవ్వలేదు. కెసీఆర్, కేటీఆర్, నాది రక్త సంబంధం. మా కుటుంబం విచ్ఛిన్నమైతే వారికి అధికారం వస్తుంది. కేసీఆర్ గారు మీ చుట్టూ ఏం జరుగుతుందో చూసుకోండి. నన్ను బయటకి పంపించిన మాత్రమే ఏమీ కాదు. రేపు కేటీఆర్‌ని బయటికి పంపుతారూ. రామన్నకి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. హరీశ్ రావు, సంతోష్ ఇప్పుడు మీతో బాగున్నట్టు ఉన్న తర్వాత మీకు ఇబ్బంది పెడతారు..అని కవిత సంచలన కామెంట్స్ చేశారు.
కాళేశ్వరంపై కేసీఆర్‌పై అవినీతి మరక పడడానికి కారణం హరీష్ రావు. కేసీఆర్ పార్టీ పెట్టినప్పుడు మొదటి హరీష్ రావు చేరలేదు. హరీష్ రావు ట్రబుల్ షూటర్ కాదు బబుల్ షూటర్. దాసోజు శ్రావణ్ mlc గా పెట్టాలనుకున్నప్పుడు హరీష్ రావు మరొకరికి పెట్టాలని సూచించారు. బీజేపీ ఎమ్మెల్యే నాకు చెబితే కేసీఆర్‌కు చెప్పాను. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీ ఇచ్చిన ఫండ్ కాకుండా పదిమంది ఎమ్మెల్యేలకు అదనంగా నిధులు కేటాయించారు. ఆ డబ్బులు కాలేశ్వరం అవినీతికి సంబంధించినవి. సిరిసిల్ల రామన్నను ఓడగొట్టేందుకు 60 లక్షల పంపారు. నిజం మాట్లాడితే నన్ను బయటకు పంపారు. కేసీఆర్, కేటీఆర్ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీపై నాకు కోపం ఎందుకు ఉంటుంది. అధికారంలో ఉన్నప్పుడు నన్ను ప్రతిపక్ష నేతగా చూసిన నేను పట్టించుకోలేదు. కేసిఆర్ ఆరోగ్యంగా ఉండేలా చూసుకోండి రామన్న. ఆరడుగుల బుల్లెట్ నన్ను గాయపరిచింది...నెక్స్ట్ ఎవర్ని గాయపరుస్తుందో చూసుకోండి. దుబ్బాకలో ఓడిపోవడానికి హరీష్ రావే కారణం. నేను ఉద్యమంలో నుంచి వచ్చా ఉద్యమాన్ని చేపడతా..అని కవిత వ్యాఖ్యానించారు.