కుమారుడి రిసెప్షన్ రద్దు చేసి, సీఎంకు రూ.2 కోట్ల చెక్కు ఇచ్చిన ఎమ్మెల్యే

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి రూ.2 కోట్ల చెక్‌ను మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, కుటుంబ సభ్యులతో కలిసి అందజేశారు.

By -  Knakam Karthik
Published on : 18 Sept 2025 12:24 PM IST

Hyderabad News, Cm Revanthreddy, Farmers, Urea Shortage, Mla Batthula Laxma Reddy

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి రూ.2 కోట్ల చెక్‌ను మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, కుటుంబ సభ్యులతో కలిసి అందజేశారు. తన నియోజకవర్గంలోని రైతుల కోసం ఖర్చు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి విరాళం అందించారు. లక్ష మంది రైతులకు ఒక్కో యూరియా బస్తా ఉచితంగా అందించాలని సీఎంను ఆయన కోరారు. ఇటీవల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కుమారుడు సాయి ప్రసన్న వివాహం జరిగింది. మిర్యాలగూడలో భారీ ఎత్తున రిసెప్షన్‌ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే భావించారు. కానీ రిసెప్షన్‌ను రద్దు చేసుకుని ఆ డబ్బును రైతుల కోసం ఖర్చు చేసేందుకు ఆయన ముందుకు వచ్చారు. లక్ష్మారెడ్డి, ఆయన కుటుంబసభ్యులను సీఎం అభినందించారు.

Next Story