ఆ పాపం అంతా బీఆర్ఎస్‌దే : మంత్రి ఉత్తమ్

ఖరీఫ్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటె ఎక్కువ వరి తెలంగాణ లో పండిందని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.

By Medi Samrat  Published on  5 March 2025 8:15 PM IST
ఆ పాపం అంతా బీఆర్ఎస్‌దే : మంత్రి ఉత్తమ్

ఖరీఫ్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటె ఎక్కువ వరి తెలంగాణ లో పండిందని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. గాంధీ భవన్‌లో ఆయ‌న‌ చిట్ చాట్‌లో మాట్లాడుతూ.. రబీలో 56 లక్షల ఎకరాల పైగానే సాగు జరుగుతుంది. రబీ యాక్షన్ ప్లాన్ ప్రకటన చేసాం.. ముందు ఇచ్చిన సమాచారం ప్రకారమే నీళ్లు ఇస్తున్నామ‌న్నారు. తక్కువ నీటిని సమర్దవంతంగా ఉపయోగిస్తున్నాం.. కృష్ణా, గోదావరి జలాల్లో బీఆర్ఎస్ చేసిన పొరపాటు వల్ల రైతులకు ఇబ్బందులు వస్తున్నాయన్నారు.

ఏపీకి దారాదత్తంగా నీటిని బీఆర్ఎస్ ప్రభుత్వం వదిలిపెట్టింది.. కృష్ణ నదీ జలాల్లో 512 టీఏంసీలు ఇవ్వాలని బీఆర్ఎస్ ప్రభుత్వం లిఖిత పూర్వకంగా రాసి ఇచ్చింది.. కాంగ్రెస్ అధికారంలో వచ్చాక రూల్స్ మార్చాలని ఓత్తిడి తెచ్చాం.. గోదావరి జలాల్లో పాపం అంతా బీఆర్ఎస్‌దే అన్నారు. తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్టు కట్టకపోవడమే అత్యంత నష్టదాయకం అన్నారు. గోదావరి బేసిన్ లో వాటర్ క్రైసిస్ అంతా బీఆర్ఎస్ పాపమేన‌న్నారు. మేడిగడ్డ దగ్గర ప్రమాద రక్షణ చర్యలు చేపట్టకపోతే.. ఊళ్ళు కొట్టుకుపోతాయని NDSA రిపోర్ట్ ఇచ్చింది.. హరీష్ రావు తప్పుడు ఆరోపణలు మానుకోవాల‌న్నారు.

Next Story