ఉపాధి హామీ పథకం పేరు మార్పు..బీజేపీపై మంత్రి సీతక్క ఘాటు వ్యాఖ్యలు

ఉపాధి హామీ చట్టానికి ఉరి వేయాలని బీజేపీ కుట్రలు చేస్తుంది..అని రాష్ట్ర మంత్రి సీతక్క ఆరోపించారు.

By -  Knakam Karthik
Published on : 22 Dec 2025 1:48 PM IST

Telangana, VB-G RAM G Bill, Central Government, Minister Seethakka, MGNREGA, Bjp

ఉపాధి హామీ పథకం పేరు మార్పు..బీజేపీపై మంత్రి సీతక్క ఘాటు వ్యాఖ్యలు

హైదరాబాద్: ఉపాధి హామీ చట్టానికి ఉరి వేయాలని బీజేపీ కుట్రలు చేస్తుంది..అని రాష్ట్ర మంత్రి సీతక్క ఆరోపించారు. గాంధీభవన్‌లో ఆమె మీడియాతో మాట్లాడుతూ..గాడ్సే ద్వారా గాంధీని చంపి ఇప్పుడు గాంధీ పేరును మార్చాలని కుట్రలు చేస్తున్నారు. గాంధీ పేరు ఉండొద్దు,పేదలకు ఉపాధి ఉండొద్దు అని కుట్రలు చేస్తున్నారు. అడవులను లేకుండా చేసి ఉపాధి హామీ లేకుండా చేయాలని నామ రూపం లేకుండా చేయాలని బీజేపీ కుట్రలు చేస్తుంది. పేదలకు ఉపాధి హామీ కల్పించాలని ఉపాధి హామీ చట్టాన్ని తీసుకొచ్చారు. కరోనా కష్ట కాలంలో వారిని ఉపాధి హామీ పథకమే గట్టెక్కించింది.

100 రోజుల్లో కనీసం సగం రోజులు కూడా పని దినాలు కేటాయించలేదు. 120వ రోజు పని దినాలు అనేది బోగస్. మోదీ ప్రభుత్వం పేదల రెక్కలు విరిచి, గాంధీ పేరును తీసి వేయాలని కుట్రలు చేస్తున్నారు. ఇప్పుడు ఉపాధి హామీ పథకానికి తూట్లు పొడుస్తున్నారు. కేంద్రం బాధ్యతను రాష్ట్రాల మీద వదిలేస్తున్నారు. దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. జి రాంజీ చట్టంతో గ్రామాల్లో చాలా ప్రమాదం ఏర్పడుతుంది. మళ్లీ బానిసత్వం తీసుకురావాలని బీజేపీ చూస్తుంది.

కొత్త సర్పంచ్‌లు గ్రామాలలో ఉపాధి హామీపై తీర్మానం చేసి కేంద్రానికి పంపాలి. సర్పంచ్‌లతో రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు నిర్వహిస్తాం. సర్పంచ్‌లు అందరూ ర్యాలీలో పాల్గొనాలి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉపాధి హామీని పట్టించుకోలేదు. అధికారం ఉంటే బయటకు వస్తాం లేదంటే రాలేం అంటే నాయకుడు ఎలా అవుతారు..అని సీతక్క ప్రశ్నించారు.

Next Story