తెలంగాణలో అంగన్వాడీలకు గుడ్ న్యూస్.. ఏపీలో కొనసాగుతున్న పోరు..!

తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆ రాష్ట్రంలో అంగన్వాడీ కార్యకర్తలకు శుభవార్త చెప్పారు.

By Medi Samrat  Published on  14 Dec 2023 7:54 PM IST
తెలంగాణలో అంగన్వాడీలకు గుడ్ న్యూస్.. ఏపీలో కొనసాగుతున్న పోరు..!

తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆ రాష్ట్రంలో అంగన్వాడీ కార్యకర్తలకు శుభవార్త చెప్పారు. తెలంగాణ సచివాలయంలో తన ఛాంబర్‌లో వేదమంత్రోచ్చారణల మధ్య ఆమె మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. మినీ అంగన్వాడీలుగా ఉన్న కేంద్రాలను ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా మారుస్తూ రూపొందిన ఫైలుపై సంతకం చేశారు. ఈ నిర్ణయంతో 3,989 మినీ అంగన్వాడీ కేంద్రాలుగా ఉన్నవి ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా మారనున్నాయి. అంతేకాకుండా అంగన్వాడీ టీచర్లకు మంత్రి తీపి కబురు చెప్పారు. అంగన్వాడీ టీచర్ల జీతాలు పెంచుతూ నిర్ణయించిన ఫైల్ మీద కూడా సంతకం చేశారు. దీంతో ఇప్పటివరకు రూ.7,500 వేతనం ఇక నుంచి రూ.13,500కు పెరగనుంది.

ఇక ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అంగన్వాడీలు ఆందోళనకు దిగారు. ప్రభుత్వంతో రెండు రోజులుగా జరిపిన చర్చలు విఫలం కావడంతో అంగన్వాడీలు నిరవధికంగా చేపట్టిన సమ్మె మూడో రోజుకు చేరుకుంది. అంగన్‌వాడీలకు మద్దతుగా సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎఫ్‌టీయూలు కలిసి సమ్మెలో పాల్గొంటున్నాయి. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర 222వ రోజు గురువారం ఉదయం యలమంచిలి అసెంబ్లీ నియోజకవర్గం కొత్తూరు ఎస్వీ కన్వెన్షన్ క్యాంప్ సైట్ నుంచి ప్రారంభించారు. ఈ సందర్భంగా లైను కొత్తూరులో రోడ్డు మార్గంలో అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్స్ మూడవరోజు సమ్మె చేస్తున్న దీక్ష శిబిరాన్ని సందర్శించారు. వారి సమస్యలు, డిమాండ్లను అడిగి తెలుసుకున్నారు.

Next Story