నా జోలికి వచ్చినోళ్లెరూ బాగుపడలేదు.. మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు
ములుగు నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను తట్టుకోలేక బీఆర్ఎస్ కుట్రలు చేస్తోందని మంత్రి సీతక్క ఆరోపించారు.
By Medi Samrat
ములుగు నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను తట్టుకోలేక బీఆర్ఎస్ కుట్రలు చేస్తోందని మంత్రి సీతక్క ఆరోపించారు. కేటీఆర్ ప్రొద్బలంతోనే ములుగు నియెజకవర్గంలో తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ఎన్నికల ముందు నన్ను ఓడించేందుకు కోట్లు ఖర్చు పెట్టారు.. కానీ ములుగు నియోజకవర్గ ప్రజలు నన్ను నమ్మి గెలిపిస్తే అభివృద్ధి చేస్తూ ముందుకు పోతున్నానన్నారు. అట్టడుగు వర్గాల బిడ్డల నాయకత్వాన్ని దోరలు సహించలేకపోతున్నారని మండిపడ్డారు.
దురంకారంతో, దోరంకారంతో నాలాంటి అట్టడుగు వర్గాల బిడ్డను టార్గెట్ చేస్తూ రాజకీయాలు చేస్తున్నారన్నారు. పక్క నియోజకవర్గాల నుంచి లీడర్లను దింపి ధర్నాలు చేయిస్తున్నారు.. నా మీద తప్పుడు ఆరోపణ చేసిన వాళ్ళు ఎవరూ బాగుపడలేదన్నారు. నా మీద అలిగేషన్ చేస్తే మీ బిడ్డ జైలుకు వెళ్లింది.. నేను ఎవరి జోలికి వెళ్లను.. నా జోలికొస్తే ఆ తల్లి సమ్మక్క దయతో రాజకీయంగా సర్వ నాశనం అవుతారన్నారు. తన ఫోన్ ట్యాప్ చేశారని నీ సొంత చెల్లెలే బాధపడుతుంది కేటీఆర్.. సొంత చెల్లి ఫోనును ట్యాప్ చేసిన నీకు నీతి ఉందా.? సొంత చెల్లిని వేధించిన కేటీఆర్ కు ఆదివాసి అటవిబిడ్డ ఒక్క లెక్కనా? అందుకే నా మీద దొంగ లేఖలు రాయిస్తు నా ఇమేజ్ ను దెబ్బతీయాలని కుట్రలు పన్నుతున్నారన్నారు. సొంత చెల్లికి రక్షణ ఇయ్యలేని వాడివి.. ఆడ కూతురుతో నీకెందుకు.. నాశనం అయిపోతావ్.. చావులపై రాజకీయాలు చేయడమే బీఆర్ఎస్ పని అన్నారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో రెచ్చగొట్టి పేదలను చావులపాలు చేశారు.. వీళ్ళు మాత్రం దర్జాగా బతికారు.. తెలంగాణ ఉద్యమ సమయంలో అదే చేశారు..ఇప్పుడు అదే చేస్తున్నారు.. బీఆర్ఎస్ తీరును ప్రజలు గమనిస్తున్నారన్నారు. బీఆర్ఎస్ ప్రేరేపించడం వల్లే గతంలో నాగయ్య అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. బీఆర్ఎస్ హయాంలో పేదలకు ఇండ్లివ్వలేదు.. మేం ఇస్తే ఓర్వలేకపోతున్నారన్నారు. అన్ని నియోజకవర్గారల్యలో 3500 ఇండ్లు ఇస్తే.. నా నియోజకవర్గంలో 5 వేల ఇండ్లను మంజూరు చేయించాను.. బీఆర్ఎస్ నాయకులు దర్జాగా ఇల్లు నిర్మించుకున్నారు కానీ పేదలకు ఇండ్లు ఇవ్వలేదన్నారు.
మీ హయాంలో వేల మంది మా కార్యకర్తలపై కేసులు పెట్టి జైల్టో పెట్టారు.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసులు పెట్టి వేధించారు.. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ కార్యకర్తల మీద కేసులు నమోదు చేయలేదన్నారు. పదేళ్లలో రైతులు నష్టపోతే నయా పైసా పరిహారం ఇవ్వలేదన్నారు. మా ప్రభుత్వం విత్తన కంపెనీల మెడలు వంచి రూ. ఐదు కోట్ల నష్టపరిహారాన్ని రైతులకు అందిస్తున్నాం.. రైతులను ఆదుకునే కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు డ్రామాలు చేస్తున్నారు.. మాలాంటి బిడ్డలు ఎదగొద్దు అని దొరలు కుట్రలు పన్నుతున్నారు.. దోరల కుట్రలను తిప్పికొడుతామన్నారు.