అందుకే బీఆర్ఎస్ సర్వే వద్దంటోంది.. అడ్డుకుంటోంది : మంత్రి సీతక్క
మహారాష్ట్రలో బీజేపీకి లబ్ది చేకూర్చేందుకు బీఆర్ఎస్ కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందని మంత్రి సీతక్క అన్నారు.
By Kalasani Durgapraveen Published on 11 Nov 2024 3:49 PM ISTమహారాష్ట్రలో బీజేపీకి లబ్ది చేకూర్చేందుకు బీఆర్ఎస్ కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందని మంత్రి సీతక్క అన్నారు. బీజేపీకి బీ టీం గా బీఆర్ఎస్ పనిచేస్తోందన్నారు. కేసులు నుంచి తప్పించుకునేందుకు బిజెపితో బీఆర్ఎస్ అంటకాగుతోందన్నారు. మహారాష్ట్ర ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నాటి నుంచి పక్కా ప్రణాళికతో బీఆర్ఎస్ విష ప్రచారం చేస్తుందన్నారు. పదే పదే తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజా ప్రభుత్వంపై విషం చిమ్ముతోందన్నారు. అందులో బాగంగా మహిళల ఉచిత ప్రయాణ పథకంపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు.
అత్యవసర సమయాల్లో చేతిలో చిల్లి గవ్వ లేకున్నా మహిళలు ఉచిత ప్రయాణాలు చేస్తున్నారన్నారు. ఆటో డ్రైవర్లను ఉసి గొల్పి ధర్నాలు చేయిస్తున్నారన్నారు. ఓలా ఉబర్ క్యాబ్లు, బైక్లు తెచ్చినప్పుడు ఆటో డ్రైవర్లు గుర్తుకు రాలేదా? కోట్లాదిమంది మహిళలకు అన్యాయం చేసేలా బీఆర్ఎస్ కుట్రలుల పన్నుతోందన్నారు. పంట రుణమాఫీని చేయని బీఆర్ఎస్ ఇప్పుడు రైతుల ప్రేమ కురిపించడం విడ్డూరంగా ఉందన్నారు.బీఆర్ఎస్ హాయంలో 20 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేయలేదన్నారు. కానీ ప్రజా ప్రభుత్వం కేవలం 27 రోజుల్లోనే 18 వేల కోట్ల పంట రుణాలను మాఫీ చేసిందని, బీఆర్ఎస్ ఏక కాలంలో కనీసం లక్ష రూపాయలు రుణమాఫీ చేయలేదన్నారు. 50 లక్షల కుటుంబాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం అన్నారు. సామాన్యుల గృహాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలన్న ఆలోచన బీఆర్ఎస్ చేయలేదన్నారు.
మహిళలకు వేల కోట్ల వడ్డీ లేని రుణాలు ఇస్తూ వారిని ఆర్దికతంగా బలోపేతం చేస్తున్నాం అన్నారు. మహిళలకు బీఆర్ఎస్ ఎగ్గోట్టిన వడ్డీలను మేమే చెల్లిస్తున్నాం.. బీఆర్ఎస్, బీజేపీలు కలిసి రూ. 400 ఉన్న గ్యాస్ ధరను రూ.1200 చేసారన్నారు. అందుకే వంటింటి భరాన్ని తగ్గించేందుకు రూ. 500 కే సిలిండర్ ఇస్తున్నాం అని పదేళ్లలో కనీసం లక్ష ఉద్యోగాలు బీఆర్ఎస్ ఇవ్వకపోయిందన్నారు. కానీ ఆరు మాసాల్లోనే మేము 50 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం అన్నారు.
ఇప్పుడు కూడా 5 లక్షలతో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తోందన్నారు. అధికారంలో ఉన్నప్పుడు అణచివేత.. విపక్షంలో ఉన్నప్పుడు అవస్తవాలు చెప్పడమే బీఆర్ఎస్ నైజం అన్నారు. బీఆర్ఎస్ ఎన్నో హమీలిచ్చి మోసం చేసిందన్నారు. దళిత సీఎం లేడు, దళితులక మూడెకరలా భూమి లేదు.. కాని ఇప్పుడు ట్విట్టర్లో తప్పుడు ప్రచారం చేస్తూ తెలంగాణ మీద విషం చిమ్ముతున్నారన్నారు. కేటీఆర్ ట్విట్టర్ టిల్లుగా వ్యవహరిస్తున్నారన్నారు.
పంచాయతీ భవనం తాకట్టు అని హరీష్ రావు ప్రచారం చేయడం సరికాదు.. అసలు నిజాలు తెలుసుకోకుండా ట్విట్లు పెట్టి ఎందుకు గౌరవం పొగొట్టుకుంటున్నారన్నారు. బీఆర్ఎస్ హయంలో తాలు, తరుపు పేరుతో మిల్లర్లు రైతులను నిండా ముంచారన్నారు. అక్రమ మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం.. అందుకే మిల్లర్లతో కుమ్మక్కై అలజడులు సృష్టించే కుట్రలు చేస్తున్నారన్నారు. అధికారంలో ఉన్నప్పుడు సీఎం, మంత్రులు సచివాలయానికి రాలేదు.. ప్రజలకు ఎన్నడు అందుబాటులో లేరన్నారు.
కేసీఆర్ కుటుంబం తప్ప పరిపాలనకు ఏవరు అర్హులు కారు అనే బ్రమల్లో బీఆర్ఎస్ ఉందన్నారు.కులగణను అడ్డుకుంటున్న బీఆర్ఎస్ ను బీసీ సంఘాలు నిలదీయాలన్నారు. కులగణనకు అడ్డుపడుతున్న బీఆర్ఎస్ వైఖరిని కుల సంఘాలు ఎండగట్టాలి.. విదేశాల నుంచి రప్పించి బీఆర్ఎస్ కుటుంబ సర్వే చేసి ప్రజలకు నయా పైసా ప్రయోజనం చేయలేదు.. జనాభా లెక్కలు తెలిస్తేనే సంక్షేమ వాటా సాధ్యమవుతుందన్నారు. ఇంటింటి సమగ్ర సర్వేను బహిష్కరించడం అంటే మన హక్కులను, అభివృద్దిని వదులుకోవడమే అవుతుందన్నారు.
మేమెంతో.. మాకంత అన్న నినాదం నిజం కావాంలే సమగ్ర సర్వేలో వివరాలు నమోదు కావాలి.. క్లబ్బులు, పబ్బులు బంద్ అయ్యాక కొంతమంది అరాచకంగా తయారవుతున్నారన్నారు. గత పదేండ్లలో జరిగిన నష్టాన్ని ప్రజలు ఇంటింటి సర్వే వద్దనుకుంటే ఎవరికి నష్టం జరుగుతుందో ప్రజలు ఆలోచించుకోవాలన్నారు.