బలహీన వర్గాలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలనే చిత్తశుద్ధితో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది..అని తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. హైదరాబాద్ గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆర్డినెన్స్, శాసనసభకు సంబంధం లేదు. 2018 పంచాయితీ రాజ్ యాక్ట్‌కు అనుగుణంగా 42 శాతం బీసీలకు రిజర్వేషన్ ఇస్తున్నాం. బీజేపీ ఓబీసీ నేత లక్ష్మణ్‌కు ఉన్న అనుమానాలు ఏంటి?. లక్ష్మణ్ కాంగ్రెస్ బిల్లును అడ్డుకుంటే జాతీయ అధ్యక్ష పదవి ఇస్తా అని మీ పార్టీ అంటే పోవద్దు. బిల్లును రాష్ట్రపతి ఆమోదం చేపించి 9వ షెడ్యూల్‌లో పెట్టించండి. బీజేపీ పార్టీ కనీసం బీసీ అధ్యక్షుడుని ,శాసనపక్ష నాయకుడిని చేయలేకపోయారు. బండి సంజయ్‌ను అధ్యక్షుడుగా తొలగించి.. కేసీఆర్ మౌత్ పీస్ కిషన్ రెడ్డిని పెట్టారు..అని పొన్నం విమర్శించారు.
రిజర్వేషన్‌కు ఎవరైనా అడ్డంపడ్డ సరే కాపాడుకునే బాధ్యత బీసీ మేధావులది, బీసీ నేతలది. ఢిల్లీకి మంత్రి వర్గం అయినా సరే అఖిలపక్షాన్ని పంపడానికి సిద్ధం అని సీఎం రేవంత్ చెప్పారు. రిజర్వేషన్‌ను కాపాడుకోవడాని కులసంఘాలు ఏకమయ్యాయి. బలహీన వర్గాలకు కాంగ్రెస్ స్పష్టమైన విధానాన్ని తీసుకుంది. సామాజిక న్యాయం కోసం రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవచ్చు అని న్యాయస్థానం చెప్పింది. 3,4 ప్రకారం స్థానిక సంస్థలో, విద్యలో రిజర్వేషన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు ప్రవేశ పెట్టిన బిల్లును గవర్నర్ ఆమోదించిన బీసీ బిల్లును రాష్ట్ర పతి ఆమోదించాలని రిక్వెస్ట్ చేస్తున్నాం..అని మంత్రి పొన్నం అన్నారు.