ఐప్యాక్ సంస్థతో ఒప్పందం రద్దు చేసుకున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐప్యాక్) బీఆర్ఎస్‌తో పనిచేయడం లేదని తెలిపారు. ఐప్యాక్ సంస్థతో బీఆర్ఎస్ ఒప్పందం చేసుకుని ఎక్కువ రోజులు అయితే అవ్వలేదు. ఐప్యాక్ గతేడాది ఏప్రిల్‌లో ఒప్పందం కుదుర్చుకుంది. డిజిటల్ సోషల్ మీడియా ప్లాట్ ఫాంలో పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రశాంత్ కిషోర్ కు చెందిన సంస్థతో బీఆర్ఎస్ ఒప్పందం కుదుర్చకుంది. మునుగోడు బైపోల్‌లో ఐప్యాక్ బీఆర్ఎస్ కోసం పనిచేసింది. గతేడాది ఏప్రిల్‌లో ప్రశాంత్ కిషోర్ హైదరాబాద్‌కు వచ్చి కేసీఆర్, కేటీఆర్‌లతో ప్రత్యేకంగా చర్చలు జరిపారు. ఐ ప్యాక్ టీమ్స్ కూడా క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ కోసం సర్వేలు నిర్వహించాయి. ఆ నివేదికలను బీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌కు అందజేశాయి. ప్రస్తుతం బీఆర్ఎస్ తమ కార్యకర్తలు, వాలంటీర్లతోనే సోషల్ మీడియాలో ప్రచారం కొనసాగిస్తోందని కేటీఆర్ తెలిపారు.
గత కొంతకాలంగా బీఆర్ఎస్‌తో ఐ ప్యాక్ కలిసి పనిచేయడం లేదనే ప్రచారం కూడా జరుగుతోంది. తాజాగా ఈ వార్తలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్) బీఆర్‌ఎస్‌తో కలిసి పనిచేయడం లేదని కేటీఆర్ చెప్పారు. బీఆర్‌ఎస్‌తో ఐ ప్యాక్ ఒప్పందాన్ని ముగించుకుందని టైమ్స్ ఆఫ్ ఇండియా తెలిపింది.