అలా అయితే బీఆర్ఎస్ నేతలంతా జైల్లో ఉండేవాళ్లు : మంత్రి కొండా సురేఖ

బీఆర్ఎస్ నేత‌ల‌పై మ‌రోమారు మంత్రి కొండా సురేఖ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

By Medi Samrat  Published on  5 Dec 2024 11:28 AM
అలా అయితే బీఆర్ఎస్ నేతలంతా జైల్లో ఉండేవాళ్లు : మంత్రి కొండా సురేఖ

బీఆర్ఎస్ నేత‌ల‌పై మ‌రోమారు మంత్రి కొండా సురేఖ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బుధ‌వారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డిని అరెస్టు చేసినట్టు మేం అరెస్టు చేయాలనుకుంటే.. బీఆర్ఎస్ నేతలంతా జైల్లో ఉండేవాళ్ళని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో బీఆర్ఎస్ నేతల హస్తం లేకపోతే ఆఫీసర్లను దేశం ఎందుకు దాటించారు.? చేసేది న్యాయమే అయితే సోషల్ మీడియాను వేరే దేశం నుండి నడపాల్సిన అవసరం ఏంటి.? అని ప్ర‌శ్నించారు. గంధం చెక్కల వ్యాపారం చేస్తున్నార‌ని ఎమ్మెల్యే కోమటిరెడ్డి బ్రదర్స్ గురించి చేసిన వ్యాఖ్యలు చేస్తున్నారు.. గంధం చెక్కల ఎమ్మెల్యే గురించి మాట్లాడే స్థాయి నాది కాదన్నారు.. మా మంత్రిని ప్రొటెక్ట్ చేసే బాధ్య‌త‌ సహచర మంత్రిగా నాపై ఉంది మాట్లాడుతున్నాను అంతేన‌న్నారు.

ఆనాడు రాజీనామాలు చేయాల్సి వస్తే పారి పోయిన దొంగలు మీరు.. రాష్ట్రం కోసం రాజీనామా చేసిన చరిత్ర కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్ ది. నీ గంధం చెక్కల వ్యాపారం మడత పెడితే అప్పుడు నీకు తెలుస్తుంది.. కేసులు నమోదు చేసి బొక్కలో వేస్తే అప్పుడు తెలిసొస్తుందన్నారు. ఇంకో పిచ్చోడు హుజురాబాద్ ఎమ్మెల్యే.. అసెంబ్లీ వాతావరణం చెడగొట్టిన సాంస్కృతి ఆ ఎమ్మెల్యేది.. నిండు అసెంబ్లీలో చప్పట్లు కొట్టే సాంస్కృతి ఆ ఎమ్మెల్యే తెచ్చాడు. మహిళల పట్ల గౌరవం లేకుండా మాట్లాడే ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యే.. ఆటో వాల వద్దకు పోతే ఎళ్ల‌గొట్టారు.. ట్రైబ‌ల్స్ ద‌గ్గ‌ర‌కు వెళ్తే నాయకులను ఎళ్ల‌గొట్టారు.. ప్రజల్లో చైతన్యం వచ్చింది.. ప్రతిపక్ష పార్టీల ట్రాప్ లో పడే అవకాశం లేదన్నారు. తెలంగాణ తల్లిని దొరసాని లాగా చేశారు.. తెలంగాణ తల్లి కవితలాగా తయారు చేసారు.. బంగారు ఆభరణాలు, వడ్డానాలు పెట్టి తెలంగాణ తల్లిని తయారు చేశారు.. సబ్బండ వర్గాల ప్రతినిధిగా తెలంగాణ తల్లిని తయారు చేస్తామ‌న్నారు.

Next Story