తెలంగాణ ఇచ్చిన పార్టీ నీకు థర్డ్ గ్రేడ్ పార్టీలా కనిపిస్తుందా..? కేటీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి ఫైర్‌

కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్డారు. భారత దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన కాంగ్రెస్ పార్టీని డర్టీ పార్టీ అని మాట్లాడడం కేటీఆర్ అహంకారానికి నిదర్శనం అన్నారు.

By Medi Samrat
Published on : 21 Aug 2025 6:04 PM IST

తెలంగాణ ఇచ్చిన పార్టీ నీకు థర్డ్ గ్రేడ్ పార్టీలా కనిపిస్తుందా..? కేటీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి ఫైర్‌

కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్డారు. భారత దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన కాంగ్రెస్ పార్టీని డర్టీ పార్టీ అని మాట్లాడడం కేటీఆర్ అహంకారానికి నిదర్శనం అన్నారు. తెలంగాణ ఇచ్చిన పార్టీ నీకు థర్డ్ గ్రేడ్ పార్టీలా కనిపిస్తుందా..? నీ తండ్రిని అడుగు మా పార్టీ గురించి చెప్తాడు.. నీ తండ్రి కేసిఆర్, నువ్వు, నీ కుటుంబం తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ దగ్గర గ్రూప్ ఫోటో దిగింది మర్చిపోయారా..? అని ప్ర‌శ్నించారు.

మా పార్టీ నిల‌బెట్టిన ఉప రాష్ట్రపతి అభ్యర్థిని చూసి దేశం మొత్తం హర్షిస్తుందన్నారు. సుదర్శన్ రెడ్డి సుప్రీం కోర్టు జడ్జిగా ఉంటూనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం గళం ఎత్తిన న్యాయ కోవిదుడు అన్నారు. తెలంగాణ బిడ్డ ఉప రాష్ట్రపతి అవ్వడం మీకు ఇష్టం లేదు.. మీ తెలంగాణ వాదంపై సందేహాలు తలెత్తుతున్నాయన్నారు. తెలంగాణ బిడ్డను వ్యతిరేకించిన మిమ్మల్ని తెలంగాణ ప్రజలు క్షమించరు అన్నారు.

లక్షల కోట్ల అవినీతి చేసి ఆ డబ్బు ఉందని కళ్ళు నెత్తికెక్కి కాంగ్రెస్‌పై మాట్లాడుతున్నావ్.. అహంకారపూరితమైన మాటలు ఇక మాట్లాడకు అని హితువు ప‌లికారు. దేశం కోసం త్యాగం చేసిన గాంధీ కుటుంబంపై చులకనగా మాట్లాడడం.. అమెరికాలో చదివిన నీ చదువు, విజ్ఞతకు వదిలేస్తున్నాన‌న్నారు. నాడు ప్రపంచలోనే ద బెస్ట్ పీఎం అనిపించుకున్నారు రాజీవ్ గాంధీ.. రాజకీయంతో సంబంధం లేకుండా రాహుల్ గాంధీ దేశ ఐక్యత కోసం భారత్ జోడో యాత్ర చేశారన్నారు.

యూరియా ఎందుకు రావట్లేదో నీకు అంత మాత్రం తెలియదా.? కేంద్రం ఇవ్వాల్సింది ఇవ్వకుండా చేస్తుంటే నువ్వు అది మాట్లాడక పోగా.. అజ్ఞానంతో మాట్లాడుతున్నావ్ అని మండిప‌డ్డారు. ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఇస్తే దానిపై క్యాబినెట్ లో చర్చించాం.. అవినీతి చేయకుంటే ఢిల్లీ నుండి లాయర్లను తెప్పించి హైకోర్టుకు ఎందుకు వెళ్లారు.. మీ అవినీతి ప్రజల ముందు పెడతాం.. మీకు ఏ శిక్ష వేయాలో ప్రజలే నిర్ణయిస్తారన్నారు.

జగదీష్ రెడ్డి గురించి మాట్లాడే స్థాయికి నేను దిగజారలేదన్నారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్న ఒక్కనాడు మహాత్మగాంధీ యూనివర్సిటీ కి పోలేదు.. నేను ఇప్పుడు లా, ఫార్మసీ కోర్సులు కొత్తగా తెచ్చానన్నారు. YTPS మీద విచారణ జరుగుతుంది.. ఆయన వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయో తేలుస్తామ‌న్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గురించి, నా గురించి మాట్లాడేంత స్థాయా అత‌డిది.. నల్గొండకు మేం ఏం చేసామో ప్రజలకు తెలుసు.. త్వరలోనే నీ బాగోతం బయటపడుతుందన్నారు.

Next Story