ఎంపీలను సస్పెండ్ చేసినట్టే మిమ్మల్ని ప్రజలు సస్పెండ్ చేస్తారు : మంత్రి జూపల్లి

కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం దేశాన్ని కుల మతాల పేరుతో విచ్చిన్నం చేస్తూ.. ప్రజలను గాలికొదిలేసింద‌ని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు

By Medi Samrat  Published on  22 Dec 2023 4:50 PM IST
ఎంపీలను సస్పెండ్ చేసినట్టే మిమ్మల్ని ప్రజలు సస్పెండ్ చేస్తారు : మంత్రి జూపల్లి

కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం దేశాన్ని కుల మతాల పేరుతో విచ్చిన్నం చేస్తూ.. ప్రజా సమస్యలను గాలికొదిలేసింద‌ని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ధర్నా చౌక్ లో ఆయ‌న మాట్లాడుతూ.. పార్లమెంట్ పై దాడి జరిగితే కనీసం స్పందించలేదన్నారు. మీ హయాంలో దేశ ప్రజల స్థితిగతులు మారాయా..? అప్పుల కుప్పగా మారిందని మండిప‌డ్డారు.

ఎంపీలను సస్పెండ్ చేసినట్టే మిమ్మల్ని ప్రజలు సస్పెండ్ చేస్తారని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మ‌న‌పై ఉందన్నారు. లోక్ స‌భ‌ ఎన్నిక‌ల‌కు రెండు నెలల సమయం ఉంది.. మీకు ప్రజలు బుద్ది చెబుతారని అన్నారు. మోదీ హయాంలో విధ్వంసాలు జరుగుతున్నాయి.. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాలు కల్లోలం అవుతున్నాయన్నారు. మోదీ ప్రభుత్వానికి ప్రజలు బుద్ది చెబుతారని వ్యాఖ్యానించారు.

Next Story