హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారాయి. మంత్రి పొన్నం వ్యాఖ్యలపై .. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పందించారు. మా జాతిని మొత్తం అవమానపరిచాడు. నేను మంత్రి కావడం, మా సామాజికవర్గంలో పుట్టడం తప్పా? పొన్నం ప్రభాకర్ తన ఒప్పుకుని క్షమాపణ చెప్పాలి. ఆయనలా అహంకారంగా మాట్లాడటం నాకు రాదు. పొన్నం ప్రభాకర్ తీరు మార్చుకోకపోతే జరిగే పరిణామాలకు ఆయనే బాధ్యత వహించాలి. నేను పక్కన ఉంటే మంత్రి వివేక్ ఓర్చుకోవడంలేదు. నేను కుర్చీలో కూర్చుంటే వివేక్ లేచి వెళ్లిపోతున్నాడు. సహచర మంత్రిని అంత మాట అన్నా కూడా వివేక్ చూస్తూ ఊరుకున్నాడు. దీనిపై త్వరలోనే సోనియాగాంధీ, రాహుల్, మల్లికార్జున ఖర్గేలను కలుస్తా..అని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పేర్కొన్నారు.
వివాదానికి కారణమిదే
జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల రెహమత్ నగర్‌లో ముగ్గురు మంత్రులు.. పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మీడియా సమావేశం నిర్వహించాల్సి ఉంది. అయితే మీడియా సమావేశానికి మంత్రి లక్ష్మణ్ ఆలస్యం అయ్యారు. దీంతో పొన్నం అసహనానికి లోనై.. పక్కనే ఉన్న మంత్రి వివేక్ చెవిలో గుసగుసలాడారు. మనకు సమయం తెలుసు..జీవితం తెలుసు..కానీ వారికేం తెలుసు ఆ దున్నపోతుగానికి అంటూ మాట్లాడారు. ఆ సమయంలో మైక్‌లు ఆన్‌లో ఉండటంతో ఆయన మాటలు బయటకు వినిపించాయి. దీంతో పొన్నం ప్రభాకర్ కామెంట్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.