తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ కోసం సమయం కేటాయించాలి. అంతర్గత విషయాలు బయట చర్చించొద్దని శ్రేణులను హెచ్చరించారు. ఎవరి పనితీరు ఏంటో నాకు తెలుసు. ఎవరు పనిచేస్తున్నారో, ఎవరు నటిస్తున్నారో తెలుసన్నారు. పార్టీ లైన్ ప్రకారమే ఎవరైనా వెళ్లాల్సి ఉంటుందని, గీత దాటితే ఊరుకునేది లేదని మీనాక్షి ఇప్పటికే తేల్చి చెప్పారు. పార్టీకి వ్యతిరేకంగా ఎవరు బహిరంగ వ్యాఖ్యలు చేసినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
పార్టీలో అందరికీ అవకాశాలు కల్పిస్తామని, పదేళ్లుగా పార్టీ జెండాను భుజాన మోసిన వారికి తొలి ప్రాధాన్యత ఉంటుందని మీనాక్షి నటరాజన్ హామీ ఇచ్చారు. పీసీసీ చీఫ్ మహేష్‌గౌడ్ అధ్యక్షతన గాంధీభవన్‌లో ఆదిలాబాద్ కాంగ్రెస్ నేతలతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మీనాక్షి నటరాజన్, మంత్రి సీతక్క పాల్గొన్నారు.