మిర్యాలగూడ రైల్వే పట్టాలపై జంట.. రామ లక్ష్మమ్మ అనే పచ్చబొట్టు

ఆదివారం తెల్లవారుజామున జిల్లాలోని మిర్యాలగూడ రైల్వే స్టేషన్ సమీపంలోని 115వ మైలురాయి వద్ద ఓ మహిళ, ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మరణించారు.

By Medi Samrat  Published on  31 Dec 2023 7:45 PM IST
మిర్యాలగూడ రైల్వే పట్టాలపై జంట.. రామ లక్ష్మమ్మ అనే పచ్చబొట్టు

ఆదివారం తెల్లవారుజామున జిల్లాలోని మిర్యాలగూడ రైల్వే స్టేషన్ సమీపంలోని 115వ మైలురాయి వద్ద ఓ మహిళ, ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మరణించారు. రైల్వే ట్రాక్‌ పై విగతజీవిగా కనిపించారు. ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. 25 నుంచి 30 ఏళ్ల మధ్య వయసు ఉంటుందని భావిస్తున్నారు. మృతదేహాలను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాల దగ్గర సిమ్‌కార్డు లేని మొబైల్‌ను రైల్వే పోలీసులు గుర్తించారు. అక్కడ దొరికిన రైలు టికెట్‌ ఆధారంగా శనివారం జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ రైలులో విజయవాడ నుంచి మిర్యాలగూడకు వచ్చినట్లు అనుమానిస్తున్నారు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాధితురాలి చేతిపై రామ లక్ష్మమ్మ అనే పేరు పచ్చబొట్టు పొడిచారు. ఇద్దరి గుర్తింపులు ఇంకా తెలియాల్సి ఉంది. మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు.

ఘటనా స్థలం నుంచి ఓ సెల్​ఫోన్ స్వాధీనం చేసుకున్నామని రైల్వే పోలీసులు తెలిపారు. అందులో సిమ్ ​కార్డు లేకపోవడంతో మృతుల వివరాలు తెలియలేదని చెప్పారు. మృతదేహాలను పోస్ట్​మార్టం నిమిత్తం మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని చెప్పారు. మృతులు భార్యాభర్తలా లేక ప్రేమికులా అనే కోణంలో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు వెల్లడించారు.

Next Story