నేటికి 5 ఏళ్ళు అయ్యింది.. అది దేశానికి చీకటి రోజు

Mallikarjun Kharge Fires On BJP. 2జీ స్కామ్ పై తప్పుడు ప్రచారం చేశారని రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే అన్నారు.

By Medi Samrat  Published on  8 Nov 2021 9:28 AM GMT
నేటికి 5 ఏళ్ళు అయ్యింది.. అది దేశానికి చీకటి రోజు

2జీ స్కామ్ పై తప్పుడు ప్రచారం చేశారని రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే అన్నారు. సోమ‌వారం గాంధీభ‌వ‌న్‌లో మీడియాతో మాట్లాడిన ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు. 2జీ స్కామ్ పై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, రాందేవ్ బాబ వంటి వారు కూడా తప్పుడు ప్రచారం చేశారని అన్నారు. సంజయ్ నిరుపమ్ మీద వినోద్ రాయ్ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారని.. 2జీ స్కామ్ పై కొందరు కావాలనే కుట్ర పూరితంగా విష ప్రచారం చేశారని.. ప్రత్యేక న్యాయస్థానం కూడా 2 జీ స్కామ్ ఆధారాలు లేవని స్పష్టం చేసిందని తెలిపారు.

పెద్ద నోట్ల రద్దు చేసి నేటికి 5 ఏళ్ళు అయ్యిందని.. పెద్ద నోట్ల రద్దు చేసిన నాడు దేశానికి చీకటి రోజు అని వ్యాఖ్యానించారు. అనేక పరిశ్రమలు మూత పడి లక్షలాది ఉద్యోగాలు పోయాయని.. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయ్యిందని.. నోట్ల రద్దు వల్ల ఆర్థిక వ్యవస్థ సర్వనాశనం అయ్యిందని అన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలపై లీటర్ పైన 5 నుంచి పది రూపాయలు తగ్గించి ప్రయోజనం లేదని అబిప్రాయ‌ప‌డ్డారు. మూడు నెలల్లో కేంద్రం పెట్రోల్, డీజిల్ పైన లక్షా 92 వేల కోట్ల రూపాయలు ఆదాయం పొందారని.. తగ్గించిన ధరల వల్ల 13 వేల కోట్ల రూపాయలు మాత్రమే తగ్గుతాయ‌ని అన్నారు. ధ‌ర‌ల తగ్గింపు చాలా ఆలస్యం అయ్యిందని.. చేసిన సెస్ రద్దు కూడా తక్కువేన‌ని.. అన్నీ అబద్ధపు మాటలతో బీజేపీ కాలం వెల్లదీస్తోందని విమ‌ర్శించారు.


Next Story
Share it