మూడవ దశ సర్పంచ్ ఎన్నికలు జరిగే గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థులను గెలిపించండి...అని తెలంగాణ బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోలో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వం లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలను చేస్తుంది. ఈ రోజు అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు గ్రామ స్థాయి వరకు వస్తున్నాయి.
సన్న బియ్యం ,రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు ,200 యూనిట్ల ఉచిత విద్యుత్,మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు, ఆర్టీసీ లో ఉచిత ప్రయాణం ఇలా ఎన్నో పథకాలు అమలవుతున్నాయి. ఇంకా భవిష్యత్ లో అనేక కార్యక్రమాలను కొనసాగిస్తుంది. మూడవ దశ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థులను గెలిపించాలని కోరుతున్నా..అని పొన్నం పేర్కొన్నారు.