అర్జెంటీనాకు చెందిన ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ త్వరలో హైదరాబాద్ నగరానికి రానున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ధృవీకరించారు. డిసెంబర్ 13న మెస్సీ రానున్నారు. మెస్సీని ఆత్మీయంగా స్వాగతించేందుకు హైదరాబాద్ సిద్ధమైందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.
‘మన నగరానికి ప్రపంచ ఫుట్‌బాల్ చరిత్రలోనే గొప్ప ఆటగాడు రాబోతున్న క్షణం ప్రతి అభిమానికీ మరపురానిది. హైదరాబాద్ అతని స్వాగతానికి సిద్ధంగా ఉంది. మన ప్రజల ఉత్సాహం, స్పూర్తి, ఆతిథ్యమే మన ప్రత్యేకత’ అని సీఎం తన పోస్ట్‌లో తెలిపారు.