BRS టు TRS..పార్టీ పేరు మార్పుపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు!

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం మంచిర్యాల జిల్లా పర్యటనలో భాగంగా మీడియా చిట్‌చాట్‌లో పార్టీ భవిష్యత్తుపై అత్యంత కీలకమైన వ్యాఖ్యలు చేశారు.

By -  Knakam Karthik
Published on : 12 April 2026 8:00 PM IST

Telangana, KTR, BRS, TRS, KCR, TelanganaPolitics, Rebranding

BRS టు TRS..పార్టీ పేరు మార్పుపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు!

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం మంచిర్యాల జిల్లా పర్యటనలో భాగంగా మీడియా చిట్‌చాట్‌లో పార్టీ భవిష్యత్తుపై అత్యంత కీలకమైన వ్యాఖ్యలు చేశారు. గత కొంతకాలంగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నట్లుగానే, భారత్ రాష్ట్ర సమితి (BRS) పేరును తిరిగి తెలంగాణ రాష్ట్ర సమితి (TRS)గా మార్చే అంశంపై ఆయన స్పష్టతనిచ్చారు.

పార్టీ పేరు మార్పు వల్ల రాజకీయంగా కొంత నష్టపోయామని కేటీఆర్ ఈ సందర్భంగా అంగీకరించారు. "బీఆర్ఎస్‌గా మారిన తర్వాత తెలంగాణ సెంటిమెంట్‌కు కొంత దూరం అయ్యామని భావిస్తున్నాం. కార్యకర్తల నుంచి, క్షేత్రస్థాయి నేతల నుంచి కూడా మళ్లీ టీఆర్ఎస్‌గా మారాలనే బలమైన వినతులు వస్తున్నాయి. వ్యక్తిగతంగా నేను కూడా పార్టీ పేరు తిరిగి టీఆర్ఎస్‌గా ఉంటేనే బాగుంటుందని కోరుకుంటున్నాను" అని ఆయన పేర్కొన్నారు. అయితే, ఈ మార్పుపై తుది నిర్ణయం పార్టీ అధినేత కేసీఆర్ మాత్రమే తీసుకుంటారని, త్వరలోనే దీనిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని వివరించారు.

అధికారంలో ఉన్నప్పుడు చేసిన కొన్ని పొరపాట్లను సరిదిద్దుకుని, మళ్లీ ప్రజల్లోకి వెళ్తామని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల నాటికి పార్టీని పూర్తిస్థాయిలో సమాయత్తం చేస్తామని, తెలంగాణ అస్తిత్వమే పునాదిగా పార్టీ ప్రయాణం సాగుతుందని స్పష్టం చేశారు.

Next Story