దొంగే దొంగ అని అరిచినట్లు కేటీఆర్ తీరు.. బీఆర్ఎస్‌పై పరిగి ఎమ్మెల్యే ఫైర్

పరిగి నియోజకవర్గంలోని ఏ మండలానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చిందో గ్రామాల వారీగా చర్చకు సిద్ధమా అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు సవాల్ చేశారు.

By Knakam Karthik  Published on  18 Jan 2025 2:07 PM IST
Telangana, congress, brs, ktr, mla rammohan reddy

దొంగే దొంగ అని అరిచినట్లు కేటీఆర్ తీరు.. బీఆర్ఎస్‌పై పరిగి ఎమ్మెల్యే ఫైర్

రంగారెడ్డి జిల్లాను సర్వనాశనం చేసిందే బీఆర్ఎస్ అంటూ పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిగి నియోజకవర్గంలోని ఏ మండలానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చిందో గ్రామాల వారీగా చర్చకు సిద్ధమా అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు సవాల్ చేశారు. దొంగే దొంగ అని అరిచినట్లు కేటీఆర్ మాటలు ఉన్నాయని ఎద్దేవా చేశారు. నల్ల జీవోలను తీసుకొచ్చి, రాష్ట్రాన్ని దివాలా తీయించి, అప్పుల్లోకి నెట్టారని కేటీఆర్‌పై విమర్శలు చేశారు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి.

తెలంగాణ రైతులకు రూ.21 వేల కోట్లు రైతు రుణమాఫీ చేసిందని వాస్తవం కాదా?, పరిగి నియోజకవర్గానికి రూ.294 కోట్లు రైతు రుణమాఫీ అయింది నిజం కాదా? అని ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్నారు. 766 మంది రైతులకు రూ.6.74 కోట్లు రుణమాఫీ అయిందని తెలిపారు. ఉపాధి హామీ చేసే రైతు కూలీలకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. సన్నవడ్లకు రూ.500 బోనస్, పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నామన్న ఆయన, గ్రామ సభల ద్వారా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ జరుగుతుందని తెలిపారు.

Next Story