హరీష్ రావు నివాసానికెళ్లిన కేటీఆర్

తెలంగాణ మాజీ మంత్రి హరీశ్‌రావు నివాసానికి కేటీఆర్ వెళ్లారు. అనారోగ్యంతో ఉన్న హరీశ్‌రావు తండ్రి ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేశారు.

By Medi Samrat
Published on : 16 May 2025 8:00 PM IST

హరీష్ రావు నివాసానికెళ్లిన కేటీఆర్

తెలంగాణ మాజీ మంత్రి హరీశ్‌రావు నివాసానికి కేటీఆర్ వెళ్లారు. అనారోగ్యంతో ఉన్న హరీశ్‌రావు తండ్రి ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేశారు. ఆ ఇరువురి మధ్య దాదాపు రెండు గంటల పాటు చర్చ జరిగినట్టు సమాచారం.

పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి. రామారావును అధ్యక్ష పదవికి నియమిస్తే తాను స్వాగతిస్తానని, తన మద్దతును అందిస్తానని హరీష్ రావు మంగళవారం అన్నారు.పార్టీ నాయకత్వాన్ని కేటీఆర్ కు అప్పగిస్తే తాను స్వాగతిస్తాను, సహకరిస్తానన్నారు. పార్టీ అధ్యక్షుడు కె. చంద్రశేఖర్ రావు ఇచ్చిన ఆదేశాలను పాటిస్తానని, ఎప్పుడూ పార్టీ గీతను దాటనన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుండి తాను పార్టీలో ఉన్నానని, దాని ప్రయాణంలోని ప్రతి అడుగులోనూ ఆదేశాలను పాటించానని చెప్పారు. "నా నాయకుడు కేసీఆర్. కేసీఆర్ ఏం చెప్పినా హరీష్ రావు దాన్ని పాటిస్తారు" అని ఆయన అన్నారు.

Next Story