కేసీఆర్ దంపతుల స్కెచ్ పెయింటింగ్ కు ప్రశంసలు

KTR Son Himanshu Impresses Over Twitterite's Pencil Sketch Of KCR And His Wife. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే ఎంతో మందికి అభిమానం.

By Medi Samrat  Published on  3 Jun 2021 1:59 PM GMT
కేసీఆర్ దంపతుల స్కెచ్ పెయింటింగ్ కు ప్రశంసలు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే ఎంతో మందికి అభిమానం..! ఆయన మీద ఆయన కుటుంబ సభ్యుల మీద వివిధ రూపాలలో అభిమానాన్ని కొందరు ప్రదర్శిస్తూ ఉంటారు. పలువురు ఆయన మీద అభిమానాన్ని తమ పెయింటింగ్ ల ద్వారా చూపిస్తూ ఉంటారు. అలా కేసీఆర్ దంపతులకు చెందిన ఫోటో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతూ ఉంది. ఆ పెయింటింగ్ కేసీఆర్ మనవడు కూడా చూశారు. ఆ ఫోటోకు ఫిదా అయిపోయి ప్రశంసలు కూడా కురిపించారు.


తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, ఆయన సతీమణి శోభా దంపతుల పెన్సీల్ స్కెచ్ పెయింటింగ్ ను చూసిన మనమడు, మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షు పెయింటింగ్ అద్భుతంగా ఉందంటూ ప్రశంసలు కురిపించారు. పెయింటింగ్ గీసిన వారికి హిమాన్షు థ్యాంక్స్ చెబుతూ ట్వీట్ చేశారు. ఈ పెన్సీల్ స్కెచ్ పెయింటింగ్‌ను కరీంనగర్ జిల్లాకు చెందిన కలికోట వెంకటాచారి వేశారు. పెన్సీల్‌తో గీసిన ఈ ఆర్ట్‌ను తొలుత కలికోట వెంకటాచారి ట్విట్టర్‌లో షేర్ చేయగా.. ఆ తరువాత యర్రోజు చందు అనే వ్యక్తి ఆ ట్వీట్‌ను మంత్రి కేటీఆర్, ఆయన తనయుడు హిమాన్షుకు ట్యాట్ చేస్తూ రీట్వీట్ చేశారు. హిమాన్షు చూసి పెయింట్ చాలా బాగుందంటూ మెచ్చుకుని రీట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


Next Story
Share it