ఇక‌పై సింగ‌ర్ హిమాన్షు క‌ల్వ‌కుంట్ల.. పాట‌తో అద‌ర‌గొట్టాడు..!

KTR Son Himanshu cover song. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ తనయుడు హిమాన్షు సింగ‌ర్ గా త‌న టాలెంట్‌ను భ‌య‌పెట్టాడు

By Medi Samrat  Published on  17 Feb 2023 6:01 PM IST
ఇక‌పై సింగ‌ర్ హిమాన్షు క‌ల్వ‌కుంట్ల.. పాట‌తో అద‌ర‌గొట్టాడు..!

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ తనయుడు హిమాన్షు సింగ‌ర్ గా త‌న టాలెంట్‌ను భ‌య‌ట‌పెట్టాడు. తన మొదటి కవర్ సాంగ్ ‘గోల్డెన్ అవర్’ని శుక్రవారం తన యూట్యూబ్ ఛానెల్.. హిమాన్షు రావు కల్వకుంట్ల వేదిక‌గా విడుదల చేశారు. హాలీవుడ్ పాప్ సింగ‌ర్ జేవీకేఈ పాడిన పాడిన గోల్డెన్ అవ‌ర్ సాంగ్‌ను తీసుకొని హిమాన్షు కవర్ సాంగ్ చేశాడు. ఎంతో ఫీల్‌తో అనుభ‌వ‌మున్న సింగ‌ర్‌లా పాడ‌టంతో ఈ పాట కొద్దిసేప‌టికే నెట్టింట వైర‌ల్ గా మారింది. క‌ల్వ‌కుంట్ల అభిమానులు.. హిమాన్షు పాట‌కు త‌మ‌దైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. మంచి సింగ‌ర్ అయ్యే ల‌క్ష‌ణాలు ఉన్నాయంటూ పొగ‌డ్త‌ల్లో ముంచెత్తుతున్నారు.

ఇక హిమాన్షు తండ్రి కేటీఆర్ త‌న కొడుకు ప్ర‌తిభ‌ను మెచ్చుకుంటూ ఓ ట్వీట్ చేశారు. నా కొడుకును చూస్తుంటే ఎంతో గ‌ర్వంగా, ఆనందంగా ఉంది. ఈ పాట నాకు న‌చ్చింది.. మీకు కూడా న‌చ్చుతుంద‌ని ఆశిస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు.


Next Story