వారిద్ధ‌రు ర‌హ‌స్య మిత్రులు.. ఖచ్చితంగా ఆ ఒప్పందాలు బయటకు వస్తాయి : కేటీఆర్‌

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్‌ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్ లపై విరుచుకుపడ్డారు

By Medi Samrat  Published on  21 Oct 2024 6:46 PM IST
వారిద్ధ‌రు ర‌హ‌స్య మిత్రులు.. ఖచ్చితంగా ఆ ఒప్పందాలు బయటకు వస్తాయి : కేటీఆర్‌

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్‌ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్ లపై విరుచుకుపడ్డారు. రేవంత్ లాంటి దగుల్బాజీ ముఖ్యమంత్రి దేశంలో ఎక్కడా లేడన్నారు కేటీఆర్. ఉద్యోగాల కల్పనపై సీఎం రేవంత్ అబద్దాలు చెప్తున్నాడని విమర్శించారు. సీఎం రేవంత్, బండి సంజయ్‌లు రహస్య మిత్రులని, రేవంత్ కుర్చీ పోతుంటే బండి సంజయ్‌కి ఎందుకంత బాధ అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీ రహస్య ఒప్పందాలు ఖచ్చితంగా బయటకు వస్తాయన్నారు కేటీఆర్. రాహుల్ గాంధీ అశోక్ నగర్‌కు వచ్చి కాంగ్రెస్‌ ప్రభుత్వ వార్షికోత్సవం జరుపుకోవాలని సూచించారు. రైతుల ద్రోహి కాంగ్రెస్ పార్టీ అని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు.

గ్రూప్‌ వన్‌పై హైకోర్టు నిర్ణయం తీసుకునే వరకు ఫలితాలు వెల్లడించవద్దన్న సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్నారు. జీవో-29 రద్దు పిటిషన్‌ను సుప్రీం డిస్పోస్ చేయలేదని.. సుప్రీం కోర్టులో మేమే పిటిషన్ దాఖలు చేశామ‌ని తెలిపారు. గ్రూప్-1 అభ్యర్థులు వచ్చి అడిగితేనే పిటిషన్ దాఖలు చేశామ‌న్నారు. శుక్రవారం విచారణకు తీసుకుంటారని అనుకున్నా.. పిటిషన్‌పై సోమవారం విచారణ జరిపారు. ఓవైపు TSPSC పరీక్షను నిర్వహిస్తుంటే తాము పరీక్ష విషయంలో జోక్యం చేసుకోలేమని సుప్రీం తెలిపింది, అంతేకాని పిటిషన్‌ను సుప్రీం డిస్పోస్ చేయలేదన్నారు. రిట్ పిటిషన్ డిస్పోజ్‌పై హై కోర్టు నిర్ణయం తీసుకునే వరకు ఫలితాలు విడుదల చేయొద్దని సుప్రీం చెప్పిందన్నారు. తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రమాణికం కాదనడం అన్యాయమన్నారు. జీవో‌ 29 వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లకు విఘాతం కలుగుతుందన్నారు.

Next Story