పట్నం నరేందర్‌రెడ్డి అరెస్ట్.. సీఎం చేతగాని పాలనకు నిదర్శనం: కేటీఆర్‌

పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ రేవంత్ రెడ్డి చేతగాని పాలనకు నిదర్శనమని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు.

By అంజి  Published on  13 Nov 2024 8:54 AM IST
KTR, Patnam Narender Reddy, arrest, CM Revanth Reddy, tyrannical rule, BRS

పట్నం నరేందర్‌రెడ్డి అరెస్ట్.. సీఎం చేతగాని పాలనకు నిదర్శనం: కేటీఆర్‌

పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ రేవంత్ రెడ్డి చేతగాని పాలనకు నిదర్శనమని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. తన సొంత నియోజకవర్గంలో ప్రజలు చేసిన తిరుగుబాటును.. సీఎం రేవంత్‌ రెడ్డి బీఆర్ఎస్ కు ఆపాదించే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కార్యకర్తలతో మాట్లాడిన కూడా ప్రజా ప్రతినిధులను అరెస్ట్ చేస్తున్న దౌర్భాగ్యపు ప్రభుత్వం ఇదని కేటీఆర్‌ మండిపడ్డారు. ప్రజలు తిరగబడుతుంటే వారిని అణిచివేసేందుకు లగచర్లలో అప్రజాస్వామిక చర్యలకు దిగారని, పట్నం నరేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకొని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ అరెస్ట్ లు తప్పవని బెదిరిస్తున్నారని అన్నారు.

ప్రజల తరఫున పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను అక్రమ కేసులు, అరెస్ట్ లతో భయపెట్టాలని చూస్తే అది మూర్ఖపు చర్యే అవుతుందన్నారు. రేవంత్ రెడ్డి అప్రజాస్వామిక చర్యలపై బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని కేటీఆర్‌ తెలిపారు. ఉద్యమకాలం నుంచి బీఆర్ఎస్ ఇలాంటి నిర్భంధాలు, అక్రమ అరెస్ట్ లు ఎన్నో చూసిందని, ఎంత అణిచి వేసే ప్రయత్నం చేస్తే అంత పోరాటం చేస్తామన్నారు. పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నామని, వెంటనే ఆయనను, లగచర్లలో అరెస్ట్ చేసిన రైతులను విడుదల చేయాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు.

Next Story