ఆయన రాజీనామాను స్వాగతిస్తున్నాం: కేటీఆర్

న్యూఢిల్లీలో బుధవారం జరిగిన కార్యక్రమంలో సీనియర్ రాజకీయ నాయకుడు కె. కేశవరావు కాంగ్రెస్ పార్టీలో అధికారికంగా తిరిగి చేరారు.

By Medi Samrat  Published on  4 July 2024 6:47 PM IST
ఆయన రాజీనామాను స్వాగతిస్తున్నాం: కేటీఆర్

న్యూఢిల్లీలో బుధవారం జరిగిన కార్యక్రమంలో సీనియర్ రాజకీయ నాయకుడు కె. కేశవరావు కాంగ్రెస్ పార్టీలో అధికారికంగా తిరిగి చేరారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కేశవరావుకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజేషన్) కేసీ వేణుగోపాల్, ఏఐసీసీ తెలంగాణ ఇన్‌ఛార్జ్ దీపా దాస్‌మున్షీ, తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.

కాంగ్రెస్‌లో చేరిన కె.కేశవరావు తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడాన్ని స్వాగతిస్తున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ టిక్కెట్‌పై పోటీ చేసి కాంగ్రెస్‌లో చేరిన పలువురు ఎమ్మెల్యేల సంగతి ఏమిటని ఆయన ప్రశ్నించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ టిక్కెట్‌పై గెలిచిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారన్నారు. రాజ్యాంగాన్ని నిలబెడదామని రాహుల్ గాంధీ చెబుతున్నారని, కానీ ఇలా రాజ్యాంగాన్ని నిలబెడతారా? అని ప్రశ్నించారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో ఫిరాయింపులకు అవకాశం లేకుండా పదో షెడ్యూల్‌ను సవరిస్తామని కాంగ్రెస్, రాహుల్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించకుండా ఏం సందేశం ఇస్తున్నట్లని కేటీఆర్ నిలదీశారు.

Next Story