పాదయాత్రకు ఇంకా టైం ఉంది : కేటీఆర్

కేటీఆర్ బుధ‌వారం మీడియా చిట్ చాట్‌లో ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

By -  Medi Samrat
Published on : 17 Sept 2025 7:32 PM IST

పాదయాత్రకు ఇంకా టైం ఉంది : కేటీఆర్

కేటీఆర్ బుధ‌వారం మీడియా చిట్ చాట్‌లో ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. త‌న పాదయాత్ర ఖ‌చ్చితంగా ఉంటుంద‌ని స్పష్టం చేశారు. అయితే.. త‌న పాదయాత్రకు ఇంకా టైం ఉందన్న ఆయ‌న‌.. ఇంకో మూడేళ్లు ఉంది.. పాదయాత్రకు తొందరేం లేదన్నారు. ప్రస్తుతానికి స్లిమ్ అయ్యేందుకు ట్రై చేస్తు న్నాన‌ని తెలిపారు. ఈ మధ్య జిమ్‌కు కొంచెం గ్యాప్ ఇచ్చాన‌ని.. మళ్లీ స్టార్ట్ చేస్తాన‌ని పేర్కొన్నారు.

పబ్లిక్ లోకి కేసీఆర్ ఎప్పుడు రావాలో అప్పుడే వస్తాడ‌న్న కేటీఆర్‌.. జనాలకు కూడా కేసీఆర్ విలువ తెలిసిందన్నారు. ఏడాదిపాటు ప్రభుత్వానికి సమయం ఇవ్వాలనుకున్న ఇచ్చాం.. పొద్దున లేస్తే రేవంత్ రెడ్డి కేసీఆర్ జపం చేస్తున్నారు. జనంలోకి ఎప్పుడు రావాలో కేసీఆర్‌కు తెలుసున‌న్నారు.

Next Story