కాంగ్రెస్ పాలనలో రౌడీయిజం పెరిగిపోయింది, మణుగూరు ఘటనపై కేటీఆర్ సీరియస్

మణుగూరు పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ దాడి చేసి దహనం చేసిన ఘటనపై భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

By -  Knakam Karthik
Published on : 2 Nov 2025 1:30 PM IST

Telangana, Khammam District, Manuguru, Ktr, Congress, Brs

కాంగ్రెస్ పాలనలో రౌడీయిజం పెరిగిపోయింది, మణుగూరు ఘటనపై కేటీఆర్ సీరియస్

మణుగూరు పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ దాడి చేసి దహనం చేసిన ఘటనపై భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో గూండాల రాజ్యం, రౌడీయిజం పెరిగిపోయిందని కేటీఆర్ మండిపడ్డారు.

ఈ సంఘటన తెలుసుకున్న వెంటనే కేటీఆర్ గారు జిల్లా పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు గారితో ఫోన్‌లో మాట్లాడారు. 60 లక్షల భారత రాష్ట్ర సమితి కుటుంబమంతా మణుగూరు పార్టీ శ్రేణులకు తోడుగా ఉంటుందని, ధైర్యంగా ఉండాలని అన్నారు. త్వరలోనే మణుగూరును సందర్శిస్థానని కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ రౌడీ మూకలకు, వారి అరాచకత్వానికి భయపడాల్సిన అవసరం లేదని కేటీఆర్ అన్నారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం నలుమూలలా, గ్రామస్థాయి నుంచి రాష్ట్ర రాజధాని దాకా ప్రతిచోటా రౌడీల రాజ్యం నడుస్తోందని, అరాచకత్వం కొనసాగుతోందని, దీనికి చరమగీతం పాడే రోజు దగ్గర్లో ఉందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Next Story