ఇంత దారుణమా? మళ్లీ ఆనాటి దృశ్యాలు కళ్ల ముందు అంటూ కేటీఆర్ ట్వీట్

జనగామ జిల్లాలో ఓ రైతు తీసుకున్న లోన్ కట్టలేదని తన ఇంటి గేటును బ్యాంకు అధికారులు తొలగించి తీసుకెళ్లారు. అయితే ఈ ఘటనపై మాజీ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో రెస్పాండ్ అయ్యారు.

By Knakam Karthik  Published on  13 Feb 2025 10:22 AM IST
Telangana, Congress Government, CM Revanth, Brs, Ktr

ఇంత దారుణమా? మళ్లీ ఆనాటి దృశ్యాలు కళ్ల ముందు అంటూ కేటీఆర్ ట్వీట్

జనగామ జిల్లాలో ఓ రైతు తీసుకున్న లోన్ కట్టలేదని తన ఇంటి గేటును బ్యాంకు అధికారులు తొలగించి తీసుకెళ్లారు. అయితే ఈ ఘటనపై మాజీ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో రెస్పాండ్ అవుతూ.. బ్యాంకు అధికారుల తీరును ఖండించారు. అలాగే రుణం కట్టలేదని.. ఇంత దారుణమా అని ప్రశ్నించారు. ఈ ఘటనపై ఆయన ట్వీట్‌లో ఇలా రాసుకొచ్చారు. నాటి కాంగ్రెస్ పాలనలో అన్నదాతలు అప్పు కట్టలేదని.. ఆడబిడ్డల పుస్తెలు లాక్కెళ్లే దుస్థితి..రైతుల ఇళ్ల దర్వజాలు తీసుకెళ్లే పరిస్థితి.. కరెంటు మోటర్లు, స్టార్టర్లు తీసుకెళ్లే దైన్యస్థితి ఉండేది. ప్రస్తుతం స్వరాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మళ్లీ ఆనాటి దృశ్యాలు కళ్ల ముందుకు తెచ్చిందని కేటీఆర్ రాసుకొచ్చారు. కష్టాల్లో ఉన్న పాడి రైతు లోన్ కట్టలేదని.. ఏకంగా ఇంటికి ఉన్న గేటును ఎత్తుకెళతారా అని ప్రశ్నించారు.

మరి రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేస్తామని.. మాట తప్పిన ముఖ్యమంత్రి పై చర్య తీసుకునే ధైర్యముందా అన్నారు. రుణము తీర్చలేదని రైతుపై చూపిన ప్రతాపాన్ని.. రుణమాఫీ చేయని సీఎం రేవంత్ పై చూపించగలరా ? పేద రైతులకు ఒక న్యాయం.. పదవిలో ఉన్న వారికి మరో న్యాయమా అని ప్రశ్నించారు. అలాగే ఇది గుర్తుపెట్టుకోండి.. తెలంగాణ రైతులు అంతా గమనిస్తున్నారు. వారు ఇలాంటి ఘోరాలను చూస్తూ ఊరుకోరు.. కాంగ్రెస్ నేతల్ని ఇంటి గేటు కూడా తొక్కనియ్యరు అని రాసుకొచ్చారు.

Next Story