రేవంత్‌కి ఎప్పటికీ కేసీఆర్ స్థాయి రాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ పాలనతో ప్రజలకు ప్రయోజనం లేదన్నారు. తప్పు చేయలేదు కాబట్టి గట్టిగా మాట్లాడుతున్నామన్నారు. సవాల్ విసిరిన రేవంత్ చివరకు తోక ముడిచారని ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో చర్చిద్దామంటున్నారు.. మా మైక్ కట్ చేయకుండా ఉంటే చర్చకు సిద్ధం అన్నారు. రేవంత్‌ను మానసిక హాస్పిటల్‌లో చూపించాలి.. ఆధారాలు లేకుండా డ్రగ్స్, హీరోయిన్స్ అంటూ.. అనవసర ఆరోపణలు చేస్తున్నారు.. ఇంకెంతకాలం ఆరోపణలు చేస్తారు.. హామీల సంగతేంటి అని ప్రశ్నించారు.
దుబాయ్‌లో ఎవరో చనిపోతే నాకేం సంబంధం.. దమ్ముంటే ఆధారాలు బయటపెట్టాలని సవాల్ విసిరారు. లోకేష్‌ను అర్ధరాత్రి కలవాల్సిన అవసరం నాకేంటి.. నేను లోకేష్‌ను కలవలేదు.. కలిసినా తప్పేంటి అని ప్రశ్నించారు. బనకచర్లపై చర్చించామని మంత్రి నిమ్మల అన్నారు.. బనకచర్లపై చర్చించలేదని రేవంత్ చెప్పారన్నారు. తెలంగాణను అనేక అంశాల్లో నెం.1గా నిలిపాం.. చంద్రబాబుతో రహస్య ఒప్పందం బయటపడటంతోనే.. రేవంత్‌రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారన్నారు. ఏమైనా కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై నిలదీస్తూనే ఉంటామన్నారు.