లై డిటైక్టర్ టెస్ట్‎కు సిద్ధమా..? సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ స‌వాల్‌

ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న‌ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈడీ విచారణ కొద్దిస‌ప‌టి క్రితం ముగిసింది.

By Medi Samrat  Published on  16 Jan 2025 7:49 PM IST
లై డిటైక్టర్ టెస్ట్‎కు సిద్ధమా..? సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ స‌వాల్‌

ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న‌ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈడీ విచారణ కొద్దిస‌ప‌టి క్రితం ముగిసింది. విచారణ ముగిసిన అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ధైర్యం ఉంటే లై డిటెక్టర్ పరీక్షకు ముందుకు రావాలని సవాల్ విసిరారు కేటీఆర్. తన విచారణకు దాదాపుగా 10 కోట్లు ఖర్చు అవుతుంది. అందుకే రేవంత్ రెడ్డికి నేను ఒక మాట చెప్తున్నా.. మీరు మీ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఈ కేసులు పెట్టారు. మీ మీద ఏసీబీ, ఈడీ కేసులు అయ్యాయి కాబట్టి నా మీద కూడా అవే కేసులు బనాయించారని ఆరోపించారు కేటీఆర్. ఈ వృధా అవుతున్న రూ.10 కోట్ల ప్రజా ధనంతో ఇంకా 500 మందికి రుణమాఫీ చేయొచ్చని, అందుకే డబ్బులు వృధా కాకుండా లై డిటెక్టర్ పరీక్ష పెట్టాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

ఉదయం 10.30 గంటలకు ఈడీ కార్యాలయంలోకి కేటీఆర్ వెళ్లారు. ఏడు గంటలకు పైగా కేటీఆర్ ను ఈడీ అధికారులు విచారించారు. కారు రేసు నిర్వహణలో విదేశీ కంపెనీకి కేబినెట్ అనుమతి కూడా లేకుండా రూ. 45 కోట్లు బ్రిటన్ పౌండ్ల రూపంలో చెల్లించడంపై కేటీఆర్ ను అధికారులు ప్రశ్నించారు. కార్ రేసు రెండో సీజన్ కు సంబంధించి హెచ్ఎండీఏను ఎందుకు పార్ట్ నర్ గా చేశారని ప్రశ్నించారు. తొలి సీజన్ లో ఉన్న ఏస్ నెక్స్ట్ ఎందుకు తప్పుకుందని ప్రశ్నించారు.

Next Story