అంబేద్కర్‌ను స్మరించుకునే అవకాశం ఇవ్వడం లేదు : కేటీఆర్

సీఎం రేవంత్‌పై మ‌రోమారు కేటీఆర్ విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపించారు.

By Medi Samrat  Published on  6 Dec 2024 2:24 PM IST
అంబేద్కర్‌ను స్మరించుకునే అవకాశం ఇవ్వడం లేదు : కేటీఆర్

సీఎం రేవంత్‌పై మ‌రోమారు కేటీఆర్ విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపించారు. ట్విట‌ర్‌లో ఆయ‌న చేసిన ట్వీట్‌లో.. రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని తిరుగుతారు.. ఆ రాజ్యాంగం రచించిన మహనీయుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని కేసీఆర్ గౌరవంగా తెలంగాణ నడిబొడ్డున హుస్సేన్ సాగర్ తీరాన సగౌరవంగా ప్రతిష్టించారు.. అదే రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన సీఎం రేవంత్ కనీసం మహనీయుడు అంబేద్కర్ జయంతి, వర్ధంతులకు కనీసం దండేసి, దండంపెట్టి స్మరించుకునే అవకాశం ఇవ్వడం లేదని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

కేసీఆర్ కట్టిన సచివాలయంలో సమీక్షలు చేస్తూ.. కేసీఆర్ కట్టిన పోలీస్ కంట్రోల్ రూమ్ లో సమీక్షలు చేస్తూ.. కేసీఆర్ కట్టిన ప్లై ఓవర్లను ప్రారంభిస్తూ.. కేసీఆర్ కట్టిన యాదాద్రి పవర్ ప్లాంట్ ప్రారంభిస్తూ.. కేసీఆర్ ప్రతిష్టించిన అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించకుండా నిర్భంధిస్తారా.? ఇది దళితుల మీద కక్ష్యా.? మహనీయులు అంబేద్కర్ మీద వివక్షా.? అని ప్ర‌శ్నించారు.

Next Story