ఏకంగా పరువు నష్టం దావా వేసేసిన కేటీఆర్

KTR Files Defamation Case Against Revanth Reddy. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మంత్రి కేటీఆర్ ల మధ్య వివాదం మరింత ముదిరింది.

By Medi Samrat  Published on  20 Sep 2021 6:33 AM GMT
ఏకంగా పరువు నష్టం దావా వేసేసిన కేటీఆర్

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మంత్రి కేటీఆర్ ల మధ్య వివాదం మరింత ముదిరింది. ట్విట్టర్ లో డ్రగ్స్ వ్యవహారంపై కేటీఆర్, రేవంత్ రెడ్డి మధ్య గొడవ జరుగుతూ ఉంది. ఇరువురు సవాళ్లు, ప్రతిసవాళ్లు చేసుకున్నారు. దేశంలో పెరుగుతున్న డ్రగ్స్ బెడదపై యువతలో అవగాహన కల్పించడానికి తాను ప్రారంభించిన వైట్ ఛాలెంజ్‌ను మాజీ ఎంపి కొండా విశ్వేశ్వర్ రెడ్డి యాక్సెప్ట్ చేశారని.. మంత్రి కేటిఆర్ కోసం మధ్యాహ్నం 12 గంటలకు అమర వీరుల స్తూపం దగ్గర వెయిట్ చేస్తామని రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.

దీనిపై స్పందించిన కేటీఆర్.. ''నేను ఏదైనా పరీక్షకు సిద్ధంగా ఉన్నాను.. రాహుల్ గాంధీ కూడా డ్రగ్స్ పరీక్షలు చేపించుకోవడానికి సిద్ధామా?. ఇందుకోసం ఢిల్లీ ఎయిమ్స్ లో టెస్ట్స్ చేపించుకునేందుకు నేను రెడీ.. ఆ టెస్ట్‌లో నాకు క్లీన్ చిట్ వస్తే, మీరు క్షమాపణలు చెబుతారా?.. రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధమా'' అని సవాల్ చేస్తూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.

ఇప్పుడు ఈ వివాదం కోర్టు దాకా వెళ్ళింది. ఈరోజు తాను చట్టపరమైన ప్రక్రియను ప్రారంభించానని కోర్టులో పరువునష్టం దావా వేశానని కేటీఆర్ ప్రకటించారు. న్యాయ వ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందని... అబద్ధాలను కోర్టు రుజువు చేస్తుందని, అపరాధులు తగిన విధంగా బుక్ అవుతారని అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.


Next Story
Share it