హైకోర్టును ఆశ్రయించిన కేటీఆర్

బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ హైకోర్టులో క్వాష్‌ పిటిష‌న్ దాఖ‌లు చేశారు.

By Medi Samrat  Published on  20 Dec 2024 8:15 AM GMT
హైకోర్టును ఆశ్రయించిన కేటీఆర్

బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ హైకోర్టులో క్వాష్‌ పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఫార్ములా ఈ-కార్ రేసింగ్ లో ఆయ‌న‌పై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసిన విష‌యం తెలిసిందే. త‌న‌పై ఏసీబీ న‌మోదు చేసిన కేసును క్వాష్ చేయాల‌ని కోర్టులో లంచ్ మోష‌న్ పిటిష‌న్ దాఖ‌లు చేశారు. భోజ‌న విరామం త‌ర్వాత దీనిపై విచార‌ణ చేప‌ట్టాల‌ని ఆయ‌న కోరారు.

కేటీఆర్ పిటిషన్‌లో.. రాజకీయ దురుద్దేశంతోనే నాపై కేసు పెట్టారని కేటీఆర్ అన్నారు. ప్రైవేట్ సంస్థ కు లబ్ధి చేకూర్చామని ఎఫ్ఐఆర్‌లో చెప్పారు.. కానీ ప్రైవేట్ సంస్థను నిందితుల జాబితాలో చేర్చలేదన్నారు. ఏసీబీ తో పాటు ప్రిన్సిపల్ సెక్రెటరీ దాన కిషోర్ ను ప్రతివాదిగా చేర్చారు. అగ్రిమెంట్ కు ముందు నిధులు FEO పంపడం ఉలంఘన కాదన్నారు. డీనికి ఐపీసీ 409 సెక్షన్ వర్తించదన్నారు. 2023 అక్టోబర్ 30 రోజు చేసుకున్న అగ్రిమెంట్ ఎన్నికల కోడ్ ఉల్లంఘన కాదని తెలిపారు. ముందుగా చేసుకున్న అగ్రిమెంట్ కు ఇది కోనసాగింపు మాత్రమే కేటీఆర్ అన్నారు. దీనికి పీసీ యాక్ట్ కు సంబంధం లేదన్నారు. ఈ అగ్రీమెంట్ ద్వారా వ్యక్తిగతంగా నేను లాభ పడినట్టు ఎక్కడా FIR లో పొందపర్చలేదన్నారు. పొలిటికల్ మైలేజ్, రాజకీయంగా దెబ్బ తీసేందుకు కేసు పెట్టారని పిటిషన్ లో కేటీఆర్ పేర్కొన్నారు.

కాగా, ఫార్ములా ఈ-కార్ రేస్‌ కేసులో ఏసీబీ.. ఏ1గా కేటీఆర్, ఏ2గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, ఏ3గా హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డిని చేర్చిన సంగ‌తి తెలిసిందే. ఈ మేరకు తెలంగాణ ఏసీబీ గురువారం కేసు న‌మోదు చేసింది.

Next Story