జూపల్లి కృష్ణారావును వెంటనే బర్తరఫ్‌ చేయాలి: కేటీఆర్

భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొల్లాపూర్‌ నియోజకవర్గంలో ఇద్దరు బీఆర్‌ఎస్‌ కార్యకర్తల హత్యకు సంబంధించి తెలంగాణ ఎక్సైజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును వెంటనే కేబినెట్‌ నుంచి బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.

By Medi Samrat  Published on  24 May 2024 3:05 AM GMT
జూపల్లి కృష్ణారావును వెంటనే బర్తరఫ్‌ చేయాలి: కేటీఆర్

భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొల్లాపూర్‌ నియోజకవర్గంలో ఇద్దరు బీఆర్‌ఎస్‌ కార్యకర్తల హత్యకు సంబంధించి తెలంగాణ ఎక్సైజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును వెంటనే కేబినెట్‌ నుంచి బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. కొల్లాపూర్‌లో గుర్తుతెలియని వ్యక్తుల చేతిలో హత్యకు గురైన పార్టీ కార్యకర్త శ్రీధర్‌రెడ్డికి కేటీఆర్ నివాళులర్పించారు. శ్రీధర్ రెడ్డి అంతిమ యాత్రలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రాజకీయ హత్యల సంస్కృతిని పెంచి పోషిస్తోందని కేటీఆర్ ఆరోపించారు. కొల్లాపూర్‌లో ఈ సంస్కృతికి మంత్రి జూపల్లి కృష్ణారావు కారణమన్నారు.

తెలంగాణకు గతంలో ఎన్నడూ లేని విధంగా మంత్రి జూపల్లి ఫ్యాక్షనిజాన్ని తీసుకుని వచ్చారని కేటీఆర్ ఆరోపించారు. నాలుగు నెలల్లో జరిగిన రెండు హత్యల వెనుక మంత్రి ప్రమేయం ఉందని ఆయన ఆరోపించారు. మంత్రి హస్తం లేకుండా ఈ దారుణాలు జరిగేవి కావని కేటీఆర్ అన్నారు. ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే జూపల్లి కృష్ణారావును తక్షణమే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. “ఈ నియోజకవర్గంలో ఇది మొదటి హత్య కాదు. నాలుగు నెలల్లో ఇద్దరు వ్యక్తులు హత్యకు గురయ్యారు. గతంలో మల్లేష్ యాదవ్ హత్యకు గురి కాగా, ఇప్పుడు శ్రీధర్ రెడ్డి హత్యకు గురయ్యాడు. ఈ దారుణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి’’ అని కేటీఆర్ అన్నారు.

Next Story