ఆయన ఐటీ ఎంప్లాయ్ మైండ్‌తో ఆలోచిస్తారన్న రేవంత్.. యాక్సిడెంటల్ పొలిటీషియన్స్ అంటూ కేటీఆర్ కౌంటర్

దావోస్ టూర్‌లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా రెస్పాండ్ అయ్యారు.

By Knakam Karthik  Published on  23 Jan 2025 1:14 PM IST
Telangana, cm revanth, ktr, brs, congress

ఆయన ఐటీ ఎంప్లాయ్ మైండ్‌తో ఆలోచిస్తారన్న రేవంత్.. యాక్సిడెంటల్ పొలిటీషియన్స్ అంటూ కేటీఆర్ కౌంటర్

దావోస్ టూర్‌లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా రెస్పాండ్ అయ్యారు. దావోస్ పర్యటనలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి.. కేటీఆర్ ఐటీ ఎంప్లాయ్ కాబట్టి ఆయన ఎంప్లాయ్ మైండ్‌తో ఆలోచిస్తారని, తాను పొలిటీషియన్‌ పాలసీ మేకర్‌లా థింక్ చేస్తానని అని కామెంట్ చేశారు.

కాగా సీఎం కామెంట్స్‌పై కేటీఆర్ ఎక్స్‌లో రిప్లయ్ ఇచ్చారు. తనను ఒక ఐటీ ఉద్యోగి అంటూ తక్కువ చేసి మాట్లాడొచ్చని అనుకునే వాళ్లకి ఒకటే చెప్పదలచుకున్నట్టు ట్వీట్ చేసిన ఆయన.. ఐటీ ఉద్యోగుల విద్యార్హతలకు, వారి నిబద్ధతకు కొందరు యాక్సిడెంటల్ రాజకీయ నాయకులు సరితూగరు అంటూ కౌంటర్ ఇచ్చారు. అలాంటి వాళ్లు ప్రవేశపెట్టే అనాలోచిత విధానాలకు మనం భారీ మూల్యం చెల్లించుకుంటున్నామన్నారు.

ఐటీ సెక్టార్‌లో ఉండాలంటే టాలెంట్, ఎడ్యుకేషన్, అంకితభావం అనేవి చాలా అవసరమని కేటీఆర్ ట్వీట్ చేశారు. కానీ సంచుల కొద్దీ డబ్బులతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి, ఢిల్లీ బాసులకి డబ్బులు పంపడానికి ఇవేమీ అవసరం లేదని సెటైర్ వేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఐటీ ఎంప్లాయిస్ ఎంతో కష్టపడి వారి జీవనోపాధిని పొందుతున్నారని..ఐటీ, ఐటీ అనుబంధ సంస్థల్లో ఉన్న అక్కా చెల్లెళ్లకు, అన్నాదమ్ముళ్లకు సలాం అంటూ వారిని కొనియాడారు కేటీఆర్. నా విద్యార్హతలు, నా ఉద్యోగ అనుభవం, ఐటీలో నా నేపథ్యం ముఖ్యంగా ఐటీ రంగంలో ఉన్న ఉద్యోగులు నాకు ఎప్పటికి గర్వకారణమని కేటీఆర్ పేర్కొన్నారు.

Next Story