కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి కేటీఆర్ స‌వాల్‌

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి దమ్ముంటే సూర్యాపేటలో పోటీ చేయాలని.. ఎవరికి డిపాజిట్ రాదో తెలుస్తుందని

By Medi Samrat  Published on  2 Oct 2023 2:45 PM IST
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి కేటీఆర్ స‌వాల్‌

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి దమ్ముంటే సూర్యాపేటలో పోటీ చేయాలని.. ఎవరికి డిపాజిట్ రాదో తెలుస్తుందని మంత్రి కేటీఆర్ స‌వాల్ విసిరారు. సూర్యాపేటలో ఆయ‌న మాట్లాడుతూ.. ఎంతమంది వచ్చినా సరే.. బస్సులు మావే ఖర్చులు మావే.. ఏం టైంకు పోయినా ఓకే.. కరెంటు తీగలు పట్టుకుంటే తెలుస్తుంది కరెంటు ఉందో లేదో.. అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి సవాల్ విసిరారు.

వారంటీ లేని గ్యారెంటీలు కాంగ్రెస్ పార్టీవి అని విమ‌ర్శించారు. ఆరు దశబ్దాలు పాలించినా ఏమీ చేయకుండా.. మళ్ళీ ఆరు గ్యారెంటీలా.. అని ఎద్దేవా చేశారు. ఓటుకు నోటు కేసులో దొరికి.. ఎమ్మెల్యే సీట్లు అమ్ముకునే వారి మాటలు నమ్మొద్దని అన్నారు. ప్రధాని మోదీ అన్నట్టుగానే మాది కుటుంబ పాలనేన‌న్నారు. అద్భుతాలు చేస్తున్న బీఆర్ఎస్ పార్టీది వారసత్వ రాజకీయమేన‌ని స్ప‌ష్టం చేశారు. మాది మహాత్మా గాంధీ వారసత్వం.. మోదీది గాంధీని చంపిన గాడ్సే వారసత్వం అని దుయ్య‌బ‌ట్టారు. మంత్రి జగదీష్ రెడ్డి చేసిన సేవ, అభివృద్ధికి 50 వేల మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.

Next Story